క్రీడాభూమి

మళ్లీ.. ఆటల గంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వచ్చే ఏడాదినుంచి మళ్లీ పాఠశాలల్లో ఆటల పీరియడ్ మొదలవుతుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాధోడ్. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం అవసరమైతే సిలబస్‌ను 50శాతానికి కుదించే యోచన కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచే ‘ఆటల పీరియడ్’ కచ్చిత అమలుకు ఆదాశాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ‘ఆటలు చదువులో భాగం కాదనుకునే స్థితికి మనం వచ్చేశాం. ఇది దారుణం. ఆటలు కూడా చదువులో భాగమే. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఒక నిర్థారణకు వచ్చింది. వచ్చే ఏడాది నుంచి గేమ్స్ పీరియడ్‌ను కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వనుంది. అందుకోసం అవసరమైతే ప్రస్తుత సిలబస్‌ను 50 శాతానికి కుదించే అంశాన్ని యోచిస్తోంది’ అని మంత్రి వెల్లడించారు. భారత భావితరాల దృష్టి ఆటలవైపూ మళ్లించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, చేయాల్సిన కృషినంతా చేస్తోందని ఈ సందర్భంగా రాజ్యవర్ధన్ వెల్లడించారు. ‘ఇందుకోసం 2022నాటికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగులను 50శాతం కుదించే ఆలోచనా చేస్తున్నాం. ఆ మిగులు నిధులను క్రీడా ప్రోత్సాహానికి వెచ్చించాలన్నది ఆలోచన. ఈ ఏడాది 20 ప్రత్యేక స్పోర్ట్స్ స్కూళ్లను నెలకొల్పే ఆలోచనలో కేంద్రం ఉంది. ఒక్కో స్కూల్‌కు 7 నుంచి 10 కోట్లు కేటాయించనుంది. దీన్ని చిత్తశుద్ధితో ఆచరించేందుకు కృషి చేస్తున్నాం. ఒక్కో స్కూల్లో రెండు మూడు క్రీడాంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆయా స్కూళ్లు ఎంపిక చేసుకున్న క్రీడాంశాలపైనే ఫోకస్ పెట్టేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి వివరించారు. 2019 రగ్బీ ప్రపంచ కప్ టూర్‌లో భాగంగా ప్రపంచ రగ్బీ సీఈవో బ్రెట్ గాస్పెర్, ఆసియా రగ్బీ అధ్యక్షుడు అగా హుస్సేన్, నటుడు రాహుల్ బోస్, రగ్బీ భారత అధ్యక్షుడు నుమజార్ మెహతాల సమక్షంలో వెబ్ ఎల్లీస్ కప్‌ను మంత్రి ఆవిష్కరించారు. 2019 ప్రపంచ రగ్బీ టోర్నీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించేందుకు రెండేళ్లపాటు ట్రోఫీ టూర్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో టూర్ ముగించిన బృందం ముంబయి నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణించనుంది. తొలిసారి ఆసియా ఖండంలో నిర్వహించనున్న రగ్బీ ప్రపంచ కప్ టోర్నీకి జపాన్ ఆతిథ్యమిస్తోంది. ‘ప్రపంచ కప్‌కు పరుగులు తీయనున్న వెబ్ ఎల్లీస్ కప్‌కు ఘన స్వాగతం పలుకుతున్నాం. 18 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్‌ను భాగస్వామి చేయడం సంతోషంగా ఉంది’ అని ఈ సందర్భంగా మంత్రి రాజ్యవర్ధన్ రాధోడ్ పేర్కొన్నారు.