క్రీడాభూమి

ప్రసవానంతర సమస్యలు బాధిస్తున్నాయ్: సెరెనా విలియమ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిల్స్, ఆగస్టు 7: గత ఏడాది కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత నుంచి ప్రసవానంతర సమస్యలు తనను బాధిస్తున్నాయని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ వాపోతోంది. 23సార్లు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను తన ఖాతాలో జమచేసుకున్న ఈ 36 ఏళ్ల స్టార్ దిగ్గజం గర్భం దాల్చడంతో గత ఏడాది జరిగిన డబ్ల్యూటీఏ సీజన్‌లో ఆడలేకపోయింది. మళ్లీ ఇపుడు టెన్నిస్ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఉవ్విళ్లూరుతున్న తనకు ప్రసవానంతర సమస్యలతో సతమతమవుతున్నానని తెలిపింది. ప్రసవానంతరం వచ్చే సమస్యలు, ఇబ్బందులు మూడేళ్లవరకు ఉంటాయన్న అంశాలపై తాను ఎన్నో ఆర్టికల్స్‌ను చదివానని, ఈ ఇబ్బందులతోనే ఇటీవల కాలంలో పలు మ్యాచ్‌లలో ఆఖరి నిమిషంలో సరైన ఆటతీరును కనబరచలేకపోతున్నాననే భావన తనలో ఉందని పేర్కొంది. ప్రసవానంతరం ఎదురవుతున్న సమస్యల నుంచి త్వరితగతిన బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడం ద్వారా ఉపశమనం పొందుతున్నానని తెలిపింది.