క్రీడాభూమి

భారత మహిళా క్రికెట్ కోచ్ రేసులో జోషి, పోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఈ రేసులో మాజీ స్పిన్నర్లు సునీల్ జోషి, రమేష్ పోవార్ ముందున్నారు. కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ శుక్రవారం నిర్వహించే ఇంటర్వ్యూలో హాజరుకానున్న 20 మందిలో వీరిద్దరు కూడా ఉన్నారు. భారత మాజీ వికెట్ కీపర్లు అజయ్ రత్రా, విజయ్ యాదవ్, మాజీ మహిళా క్రికెటర్లు మమతా మబెన్, సుమన్ శర్మ ఇంటర్వ్యూలో చేస్తారు. పూర్ణిమా రావు ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు సుమన్ శర్మ అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించింది. కాగా, న్యూజిలాండ్ తరఫున రెండు టెస్టులు, 51 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన మరియా ఫాహే కూడా మహిళా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నది. 34 ఏళ్ల ఫాహే ప్రస్తుతం గుంటూరులోని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడెమీలో కోచ్‌గా వ్యవహరిస్తున్నది. కాగా, మొత్తం 20 మంది అభ్యర్థుల్లో జోషి, పోవార్ మధ్య కీలక పోటీ ఉంటుందని సమాచారం. తుషార్ అరోధే వివాదాస్పదంగా కోచ్ పదవి నుంచి వైదొలగిన తర్వాత పోవార్ మహిళా జట్టుకు తాత్కాలిక కోచ్‌గా ఉన్నాడు. కెరీర్‌లో 15 టెస్టులు, 69 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన పోవార్‌కు కోచ్‌గా కూడా అనుభవం ఉన్నందున, అతని ఎంపికకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తున్నది.