క్రీడాభూమి

సెమీస్‌కు జయరాం, మిథున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హో చి మిన్, ఆగస్టు 10: భారత షట్లర్లు అజయ్ జయరాం, మిధున్ మంజునాథ్ శనివారం మరో మెట్టెక్కారు. వియత్నాం ఓపెన్ బాడ్మింటన్ సూపర్ టూర్ 100 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు చేరారు. శనివారం హోరాహోరీ పోరులో ప్రత్యర్థి, కెనడా ఆటగాడు షెంగ్ గ్జియోడాంగ్‌ను 26-24, 21-17 సెట్లతో జయరాం ఓడించాడు. 2015 కొరియా సూపర్ సిరీస్‌లో ఫైనల్స్‌కు చేరిన 30ఏళ్ల ప్రపంచ 13వ ర్యాంకర్, సెమీస్ పోరులో 7వ ర్యాంకర్ జపాన్ సీడ్ యు ఇగరషిని ఎదుర్కొంటాడు. మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత యంగ్ షట్లర్ మిధున్ మంజునాథ్ చైనా ప్రత్యర్థి జౌ జెఖిపై 17-21, 21-19, 21-11 సెట్లతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. రష్యా ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన 20 ఏళ్ల షట్లర్ మిథున్ సెమీస్‌లో ఇండోనేసియా సీడ్ షెసర్ హిరెన్ రుస్తావిటోను ఎదుర్కొంటాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో మాజీ జాతీయ చాంపియన్ రితుపర్ణ దాస్ థాయిలాండ్ ప్రత్యర్థి ఫిట్టయపోర్న్ ఛైవన్ చేతిలో 19-21, 14-21 స్కోరుతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది.