క్రీడాభూమి

ఇక పసిడి పరుగులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆసియా గేమ్స్, ఒలింపిక్ 2020లో పసిడి పతకాలపై దృష్టి పెట్టమంటూ భారత ఒలింపిక్ చాంపియన్ అభినవ్ బింద్రా పిలుపునిచ్చాడు. అంతేకాదు, అథ్లెట్లలో ప్రేరణ నింపేందుకు చారిత్రక పసిడి పతకం సాధించి పదేళ్లయిన సందర్భంగా అప్పటి ప్రదర్శనను వీడియో రూపంలో విడుదల చేశాడు. ప్రపంచ క్రీడా సంరంభంలో షూటర్‌గా బింద్రా సాగించిన పసిడి పతక ప్రయాణంలోని హైలెట్స్‌తో జెట్‌సింథసిస్ నిర్మించిన వీడియో తాజాగా విడుదలైంది. ‘కోట్ల భారత ప్రజానీకానికి ప్రేరణనివ్వగల వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దింది మీరే. ప్రపంచ క్రీడా సంరంభంలో భారత్‌కు పసిడి పతకం దక్కి పదేళ్లవుతున్న సందర్భంగా, భారత అథ్లెట్లకు ఇప్పుడు చిర్నవ్వుతో పిలుపునిస్తున్నా. టోక్యో 2020 రూపంలో రెండేళ్లలో ఆ సంరభం మీ ముందుకొస్తుంది. పసిడి పతకాలపై దృష్టిపెట్టండి. భారత క్రీడా సామర్థ్య పతకాన్ని ప్రపంచ వేదికపై ఎగరేయండి’ అంటూ బింద్రా ట్వీట్ చేశాడు. 35 ఏళ్ల బింద్రా ఇటీవలే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతిష్టాత్మక అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యుడిగా గౌరవం అందుకున్న విషయం తెలిసిందే. ‘విజయాన్ని సాధించినపుడే పట్టుదల, అకుంఠిత కృషి, అంకితభావం, త్యాగనిరతికి విలువ. దేశంలో వర్థమాన ప్రతిభకు కొదువ లేదు. ఈ వీడియో వాళ్లకు ప్రేరణ నిస్తుందని, వచ్చే ఆసియా గేమ్స్, ఒలింపిక్‌లో పసిడి పతకాలను లక్ష్యం చేస్తుందని విశ్వసిస్తున్నా. పదేళ్ల క్రితం బింద్రా బంగారు పతకం సాధించడం భారత క్రీడా ఖ్యాతిలో ఓ విప్లవం. ఈ వీడియో అతని కృషి, పట్టుదలకు ఓ గుర్తింపులాంటిది. కానీ, ఇది వర్థమాన క్రీడాకారులను పసిడి దిశగా నడిపించగల సమర్థ ఆయుధమని నేను నమ్ముతున్నా. భారత్ భవిష్యత్ బంగారమేనన్న ఆశతో..’ అంటూ జెట్‌సింథసిస్ ఎండి, సిఇవో రాజన్ నవాని వీడియోలో పేర్కొన్నాడు.