క్రీడాభూమి

కంగారెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 11: సవాళ్లతోకూడిన ప్రతికూల వాతావరణంలో టీమిండియా పొరబాట్లు చేసిన మాట వాస్తవం. మరోపక్క అలవాటుపడిన వాతావరణంలో ఇంగ్లాండ్ సీమర్లు చక్కని ప్రతిభ చూపించారు. దీంతో లార్డ్స్‌లో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 107 పరుగుల వద్దే ఆలౌటైందని వైస్ కెప్టెన్ రహానె అభిప్రాయపడ్డాడు. ‘ఇంతకంటే ప్రతికూల వాతావరణాన్ని బహుశ ఇంకెప్పుడూ ఎదుర్కోమేమో. ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితులకు డ్యూక్ బాల్ కలిసొచ్చింది. విఫల వాతావరణంలో ప్రత్యర్థి బౌలర్లు రెచ్చిపోయారు. ఈ తరహా పరిస్థితులు బ్యాట్స్‌మెన్లకు సవాలే’ అన్నాడు. ‘ఇక్కడితో ఆట అయిపోలేదు. మన ప్రణాళికలు నిష్ప్రయోజనమని ఎలా అనుకుంటాం. ఇంకా రెండు రోజుల ఆట ఉంది. ఈలోగా ఏమైనా జరగొచ్చు’ అని రహానె అశాభావం వ్యక్తం చేశాడు.