క్రీడాభూమి

వైఫల్యాలపై కాదు వాస్తవాలపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారత బ్యాటింగ్ యూనిట్ వైఫల్యానికి మానసిక ఇబ్బందులే తప్ప సాంకేతిక సమస్యలేవీ కారణం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘గేమ్‌ను సింపుల్‌గా తీసుకోండి. అనవసర అయోమయంతో వత్తిడికి గురికావొద్దు’ అంటూ జట్టుకు సూచన కూడా చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ తొలి (107), మలి (130) ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. ఇన్నింగ్స్ సహా 159 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో దారుణ స్థితిలోవున్న భారత్‌కు సిరీస్ దక్కాలంటే మిగిలిన మూడు టెస్ట్‌లూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఆదివారం నుంచి నాటింగ్‌హామ్‌లో మూడో టెస్ట్ మొదలవుతోంది.
‘బ్యాట్స్‌మెన్ల సాంకేతిక సామర్థ్యంలో ఎలాంటి సందేహాలూ లేవు. ఆటపై స్పష్టతవుంటే ఆఫ్ పిచ్ బంతులనైనా బ్యాట్స్‌మన్ సమర్థంగా బౌండరీకి పంపుతాడు’ అని మ్యాచ్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘ఆటగాడి బుర్రలో అయోమయం తిష్టవేస్తే మాత్రం ప్రతి బంతీ పజిలే. ఇటొస్తుందా? అటొస్తుందా? ఎటొస్తుందీ? అన్న సందిగ్దం తలెత్తుతుంది. ఆ కన్ఫ్యూజనే కొంప ముంచుతుంది. క్రీజులోకి దిగిన తరువాత సాకులు వెతుక్కోవడం సరికాదు. మన ప్రణాళికపై స్పష్టతవుంటే, ప్రతికూల వాతావరణాన్నీ ఎదుర్కోగలుగుతాం. గొప్పవాళ్లు చెప్పే మాటొక్కటే, ఆటను సింపుల్‌గా తీసుకోమని. అప్పుడే మనమేదైనా సాధించగలం’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘ప్రపంచంలో పరిస్థితులు ఎక్కడైనా అటూ ఇటూ ఉండొచ్చు. ఆటగాడు మాత్రం స్థిరంగా ఉండాలి. మానసికంగా స్థిరంగా లేకపోతే, శూన్య బంతికూడా భూగోళంలా కనిపిస్తుంది’ అన్నాడు. అయితే, ప్రతికూల వాతావరణంలో పర్యాటక పిచ్‌లు భారత్‌కు అనుకూలించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ సమయంలో వాతావరణం చాలా పొడిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. ‘టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో ప్రతికూల వాతావరణం గురించి చాలామందే మాట్లాడుతున్నారు. వాటన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్ ప్రణాళికలు అమలుపర్చలేం. జరిగిపోయిన దానికి బాధపడుతూ.. ఇప్పుడేం చేయాలి? అన్న ఆలోచనలతో సతమతమవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలూ ఉండవు. జరిగిన పొరబాట్లనుంచి అనుభవంలోకి వచ్చిన జ్ఞానంతో ముందుకెళ్లడమే మంచిది. ఆటగాళ్లకు అంతకుమించిన ఆప్షన్లు లేవు, ఉండవు కూడా’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆరంభంలో అద్భుతమైన ఫాంను ప్రదర్శించిన బౌలర్లు సైతం లార్డ్స్‌లో ఆ ఫాంను కొనసాగించలేకపోయారని కోహ్లీ అన్నాడు. ‘అదృష్టాన్ని, వాతావరణాన్ని మనం నియంత్రించలేం. క్రికెట్‌ను గొప్పగా ఆడటం ఒక్కటే మేం చేయగలిగేది. ఆరంభంలో అద్భుతమైన బంతులతో విరుచుకుపడినా, బౌలింగ్ విభాగం దాన్ని కొనసాగించ లేకపోయింది. మైదానంలో అద్భుతమైన అవకాశాలూ దక్కలేదు. అలాగని మిస్సైందీ ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఆడినదానికంటే మంచి ఆట ఆడాల్సింది, అలా జరగలేదు’ అన్నాడు. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఐదో వికెట్‌గా దిగడంతో, మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాలు ముసిరాయి. అయితే, మూడో టెస్ట్‌కు సమయం దొరకడంతో అందుబాటులో ఉండగలనన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘వాస్తవాలను దాచాలని అనుకోవడం లేదు. టీమిండియా గడ్డు పరిస్థితిపై దృష్టి పెడతాను. పరిస్థితిని చక్కదిద్దడానికి ఏం చేయగలనో అది చేస్తాను. మెరుగైన పరిస్థితుల కోసం శక్తికొద్దీ కృషి చేస్తా’నని కోహ్లీ ప్రామిస్ చేశాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెనర్లు రాణించలేకపోయారనో, మిడిలార్డర్ సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోయిందనో నిందలు వేయలేం. దీన్ని మొత్తం బ్యాటింగ్ యూనిట్ విఫలంగానే చెప్పాలి. ఏ ఒక్కరినో వేలెత్తి చూపించే సమయం కాదిది. తదుపరి గేమ్‌తో సమష్టిగా భారత్ పరిస్థితిని మెరుగుపర్చాలి. మంచైనా, చెడైనా టీం స్పిరిట్‌గా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లడమే మంచిది’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. పొరబాటును అంగీకరించడానికి నేనే ముందుంటా. మన వైఫల్యాన్ని అంగీకరించలేకపోతే, మన ప్రావీణ్యాన్ని మెరుగుపర్చుకోలేం’ అన్నాడు కోహ్లీ. టీమిండియా ఆడిన గత ఐదు టెస్ట్‌ల్లో ఇంగ్లాండ్‌తో ఆడిన రెండో టెస్ట్ చెత్తగా ఆడామన్నది మాత్రం నిజమని అంగీకరించాడు.