క్రీడాభూమి

మహిళా క్రికెట్‌కు ప్రధాన కోచ్‌గా పోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేష్ పోవర్ నియమితులయ్యాడు. శ్రీలంక టూర్, అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్, నవంబర్‌లో వెస్టిండీస్‌లో ఐసీసీ నిర్వహించనున్న వరల్డ్ టీ-20 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించే వరకూ పోవర్ ఈ పదవిలో కొనసాగుతాడు. ‘్భరత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రమేష్ పోవర్‌ను బీసీసీఐ నియమించింది. 2018 నవంబర్ 30వరకూ ఆయన పదవిలో కొనసాగుతాడు’ అంటూ బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. కోచ్ పదవికి తుషార్ అరోథ్ రాజీనామా చేయడంతో గత నెలలోనే పోవర్ తాత్కాలిక కోచ్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. పోవర్ నాయకత్వంలోనే మహిళా జట్టు జాతీయ క్రికెట్ అకాడమీలో ఒక క్యాంపును సైతం పూర్తి చేసింది. ‘బీసీసీఐ ఈ అవకాశం కల్పించడం పట్ల సంతోషంగా ఉంది. మహిళా జట్టును ముందుకు నడిపించేందుకు నాకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తా’ అని పోవర్ వ్యాఖ్యానించాడు.