క్రీడాభూమి

వదిలేయొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 14: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌లు చేజార్చుకున్న టీమిండియా.. ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆటగాళ్ల ఫాంనుంచి జట్టు ఎంపిక వరకూ, కోచ్ నుంచి కెప్టెన్ వరకూ.. అన్ని కోణాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. పొగడ్తలతో ప్రత్యర్థుల వెటకారం ఒకవైపు, పరిస్థితిపై అభిమానుల వేదన మరోవైపు.. ఇలా టీమిండియా తీవ్ర వత్తిడి ఎదుర్కొంటోంది. మరోపక్క కోహ్లీ సేన వైఫల్యాలపై బీసీసీఐ సైతం దృష్టిపెట్టిన తరుణంలో సారథి విరాట్ కోహ్లీ తన ఫేస్‌బుక్ పేజీలో ‘మమ్మల్ని వదిలేయొద్దు’ అంటూ తన భావోద్వేగాన్ని పోస్టు చేశాడు. ‘ఆటలో ఒక్కోసారి గెలుస్తాం. ఒక్కోసారి నేర్చుకుంటాం. మాపై పెట్టుకున్న ఆశలు వదిలేయొద్దు. మీ నమ్మకాన్ని మేమూ వమ్ముచేయమని ప్రామిస్ చేస్తున్నా. ఎక్కడైనా ఎత్తుపల్లాలు సహజం’ అంటూ పెట్టిన పోస్టుతో టీమిండియా జట్టు ఫొటోను జత చేశాడు. ‘్థర్డ్ టెస్ట్‌లో విజయం సాధించి ప్రతికూలం ఉంచి అనుకూలానికి ప్రయాణించడమే ఆటగాళ్లుగా ఇప్పుడు మేం చేయగలిగేది. 2-1తో సిరీస్‌ను ఉద్వేగభరితం చేయడానికి మా కృషి మేం చేస్తాం’ అంటూ మీడియా వద్ద కోహ్లీ వ్యాఖ్యానించటం తెలిసిందే. నాటింగ్‌హామ్‌లో శనివారంనుంచి మొదలవుతున్న మూడో టెస్ట్‌కు ఇంగ్లాండ్ తన జట్టును ఇప్పటికే ప్రకటించింది. టీమిండియా తుది జట్టు ప్రకటించాల్సి ఉంది.