క్రీడాభూమి

వైట్‌వాష్ చర్చయేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మూడో టెస్ట్‌కు ముందే భారత్ వైట్‌వాష్ గురించి మాట్లాడుకోవడం తొందరపాటే అవుతుందని ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా ఇప్పటికి రెండు టెస్ట్‌లు ఆడిన భారత్ 0-2 స్కోరుతో విమర్శలు ఎదుర్కొంటోంది. ఎడ్జ్‌బాస్టన్ తొలి టెస్ట్‌లో 31 పరుగులతో ఓటమి చవిచూసిన భారత్, లార్డ్స్ రెండో టెస్ట్‌లో సిరీస్, 151 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూడటం తెలిసిందే. అయితే టీమిండియా ఇదే ఆట తీరు కొనసాగిస్తే సిరీస్‌లో వైట్‌వాష్ తప్పదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీనిపై స్పందించిన బెయిర్ స్టో, భారత్ 5-0తో వైట్‌వాష్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్ట్‌లో కనీసం పోరాట పటిమ ప్రదర్శించిన టీమిండియా, మలి టెస్ట్‌లో కనీస ప్రతిఘటన కూడా లేకుండా దారుణ ఓటమి చవిచూసిన నేపథ్యంలో భారత్‌కు వైట్‌వాష్ తప్పదన్న చర్చను కొట్టిపారేశాడు. ‘ఇంగ్లాండ్ రెండు టెస్ట్‌లు గెలిచినంత మాత్రాన భారత్‌ను ఎలా తక్కువ అంచనా వేస్తారు. క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ప్రత్యేక స్థానం ఉందన్న విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. వాళ్లు ఇప్పటికీ నెంబర్ వన్ జట్టే. పరిణామాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆటను తిప్పగల సామర్థ్యం వాళ్లకు లేదని అనలేం’ అని వ్యాఖ్యానించాడు.
‘ఔను, కలిసొచ్చిన వాతావరణాన్ని ఇంగ్లీష్ జట్టు సద్వినియోగం చేసుకుంది. పైగా సొంత పిచ్‌లపై ఆడటం మాకు బాగా తెలుసు. అలాగని సిరీస్ పోరులో భారత్ దయనీయ స్థితిలో ఉందని నేననుకోను. క్రికెట్‌లో భారత్ రికార్డులేమీ తక్కువేం కాదు. అయినా, ఇంకా చాలా క్రికెట్ ఉంది. వైట్‌వాష్‌ను ఇప్పుడు చర్చిండం తొందరపాటే అవుతుంది’ అని ది డెయిలీ టెలిగ్రాఫ్ వద్ద బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు. ‘తరువాతి టెస్ట్‌లు ఆడాల్సిన సౌతాంప్టన్, ఓవల్ పిచ్‌లు బాగా పొడిగా ఉన్నాయి. ఇక్కడ ఆడటం మాకు మొదటి రెండు మ్యాచ్‌లు ఆడినంత సులువు కాకపోవచ్చు’ అని స్టో అంటున్నాడు. తొలి టెస్ట్‌లో 70, 28 స్కోరుతో జట్టుకు వెన్నుదన్నుగా నిలిచిన బెయిర్ స్టో, మలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు సాధించి ఇంగ్లీష్ జట్టు విజయానికి వెన్నుగా నిలిచాడు.
నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో 18నుంచి మూడో టెస్ట్ మొదలవుతుంది. నాలుగో టెస్ట్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకూ, ఫిఫ్త్ టెస్ట్ సెప్టెంబర్ 7 నుంచి 11 వరకూ సౌతాంప్టన్‌లోని ఓవల్, ఏజియాస్ బౌల్‌లో జరగనున్నాయి. అయితే ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ మాత్రం ‘5-0’ ఫలితంపై ఆశ వ్యక్తం చేయడం తెలిసిందే. లార్డ్స్‌లో రెండో టెస్ట్ ఫలితం అనంతరం మీడియాతో మాట్లాడిన రూట్, ‘సిరీస్‌లో 5-0 ఫలితం మా డ్రీమ్’ అంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే. ‘ఐదు టెస్టులు కైవసం చేసుకోవాలన్న ఆశ లేకపోలేదు. నిజానికి అది మా కల కూడా. అయితే ఇది అహంతో కోరుకుంటున్నది కాదు, ఆటగాడిగా కోరుకుంటున్నదే’నని రూట్ వ్యాఖ్యానించటం తెలిసిందే.
ఇదిలావుంటే మూడో టెస్ట్‌కు బెన్ స్టోక్స్ జట్టులోకి వస్తుండటం పట్ల బెయిర్ స్టో ఆనందం వ్యక్తం చేశాడు. బెర్లిన్ క్రౌన్ కోర్టు కేసు కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన బెన్ స్టోక్స్, కేసు ముగియడంతో మూడో టెస్ట్‌కు అతనికి క్లియరెన్స్ లభించింది. దీనిపై స్టో స్పందిస్తూ ‘ఇంగ్లీష్ క్రికెట్ కోసమే తీర్పు వెలువడినంత ఆనందంగా ఉంది. నిజానికి ఇది అతనికి గొప్ప విషయం. పది నెలలుగా స్టోక్స్, అతని కుటుంబం ఇబ్బంది పడుతోంది’ అన్నాడు. ‘స్టోక్స్ ఎప్పుడెప్పుడు ఇంగ్లీష్ షర్ట్ ధరించి జట్టులోకి వస్తాడా? అని మెరిసే కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అతనేంటో రెండువారాల క్రితం ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో మనం చూశాం’ అని బెయిర్ స్టో వ్యాఖ్యానించాడు.