క్రీడాభూమి

చివరి వరకూ పోరాడండి: రవిశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, ఆగస్టు 16: ఆతిధ్య ఇంగ్లాండ్‌తో శనివారం నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడే టీమిండియా గతంలో జరిగిన లోపాలను సరిద్దుకుని చివరి వరకూ పోరాడాలని జట్టు కోచ్ రవి శాస్ర్తీ పిలుపునిచ్చాడు. ఇప్పటికే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో భారత్ వెనుకబడడంతోపాటు అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జట్టు మళ్లీ పుంజుకునేందుకు తీవ్రంగా స్పందించాడు. టెస్టు సిరీస్‌లు ఆసాంతం చాలా కష్టసాధ్యంగా మారుతున్నా జట్టు సభ్యులంతా సమష్టిగా అన్నివిభాగాల్లో పోరాడాల్సిన అగత్యం ఏర్పడిందని అన్నాడు. అయితే, మ్యాచ్‌ను గెలిపించే లేదా చివరివరకూ పోరాడే బాధ్యతను ఏ ఒక్కరిపైనో నెట్టేయకుండా సభ్యులంతా చక్కని ఆటతీరును ప్రదర్శించడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చునని అభిప్రాయపడ్డాడు.

ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైన నేపథ్యంలో కోహ్లీ ఫిట్నెస్‌పరంగా కోలుకుంటున్నాడని, బ్యాట్ పట్టడం ఖాయమని పేర్కొంటూ ఇది ఒకరకంగా మూడో టెస్టును మలుపుతిప్పేది కాబోతోందని వ్యాఖ్యానించాడు. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్య వంటివారు పూర్తి ఫిట్నెస్‌తో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.