క్రీడాభూమి

పతకమే లక్ష్యం: హిమా దాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్ స్పష్టం చేసింది. గురువారం ఆమె పీటీఐతో మాట్లాడుతూ, ఆసియా క్రీడల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని అన్నది. అయితే, పోటీని సమర్థంగా ఎదుర్కొని, పతకాలను కైవసం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నది. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నిర్వహించిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణ పతకాన్ని అందుకోవడంతో హిమ పేరు దేశంలో మారుమోగింది. అంతర్జాతీయ స్థాయిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. ఆతర్వాత కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. 400 మీటర్ల పరుగులో పీటీ ఉషను గుర్తుకు తెచ్చేలా అత్యంత వేగంగా దూసుకెళ్లే హిమపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆమె కూడా ఆ స్థాయికి తగినట్టు రాణించేందుకు కృషి చేస్తానని అన్నది. భారత్‌కు పతకాలను సాధించిపెట్టడమే తన ధ్యేయమని, అందుకు పూర్తిగా సంసిద్ధమై ఉన్నానని తెలిపింది. ఆసియా క్రీడల్లో ఈసారి భారత్ గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలు గెల్చుకుంటుందని జోస్యం చెప్పింది.