క్రీడాభూమి

థర్డ్ వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, ఆగస్టు 17: ట్రెంట్ బ్రిడ్జి. ఇంగ్లాండ్‌తో ‘్థర్డ్ వార్’కు వేదిక. ఎడ్జ్‌బాస్టన్‌లో 31 పరుగులతో కిందపడి, లార్డ్స్‌లో ఇన్నింగ్స్, 159 పరుగులతో సిరీస్‌మీదకు తెచ్చుకున్న భారత్‌ది -నిప్పులు రాల్చాలో, నిష్క్రమించాలో తేల్చుకోవాల్సిన స్థితి. ‘కాఫీ’ కబుర్లతో అడుగుపెట్టిన తమతో కషాయం తాగించిన ఇంగ్లీష్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన పరిస్థితి. చిద్విలాసంతో వచ్చినోళ్లకు చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టించిన సంగతి అనుభవంలోకి వచ్చాకే టీమిండియా కళ్లు తెరిచినట్టు కనిపిస్తుంది... ఇప్పుడిక ‘మూడో పరీక్ష’తో ‘ట్రెంట్ బ్రిడ్జి’లో ఇంగ్లీష్ జట్టుతో ఈక్వల్ అవుతుందో, (ఈ మైదానంలో ఇంగ్లీష్ జట్టుతో ఆడిన ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, రెండు ఓడి, మూడు డ్రా చేసింది) అపజయాన్ని అలవాటు చేసుకుంటుందో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది.
భారత్ గెలవాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులంతా ఆసక్తి కనబరుస్తున్న ఆటగాడు రిషబ్ పంత్. ఈ టెస్ట్‌తోనైనా అరంగేట్రానికి అవకాశమిస్తారా? అని. గాయాలపాలైన వృద్ధిమాన్ సాహ స్థానంలో వికెట్ కీపర్‌గా వచ్చిన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ఈ టూర్‌లో (నాలుగు ఇన్నింగ్స్‌లో (0, 20, 1, 0 మొత్తం 21) విఫలమవ్వడంతో, ధోనీ శిష్యుడిగా పేరుపడిన పంత్‌వైపు దృష్టి మళ్లుతోంది. జట్టులో చోటుదక్కినా తుది జట్టులో చాన్స్ కోసం ఆశగాచూస్తున్న పంత్‌తో ప్రయోగం చేయాలన్న ఆలోచనలూ లేకపోలేదు. ఇంగ్లీషోళ్లమీద రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో మూడు అర్థ సెంచరీల రికార్డుతో పంత్ కనిపిస్తున్నాడు. కెరీర్ సీజన్‌లో మూడు సెంచరీలతో ఫస్ట్‌క్లాస్ సరాసరి 54 సాధించిన రూర్కీ కుర్ర ప్లేయర్‌కు చాన్స్ ఇస్తే మంచిదన్న వాదన లేకపోలేదు. జిమ్ ఆండర్సన్, స్టార్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, శామ్ కురన్‌లాంటి సీనియర్లను ఎదుర్కోగల ఫాంతో కనిపిస్తున్న రిషబ్‌కు చాన్స్ ఇస్తే టీమిండియాకు ప్లస్సే. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తీ కాంబినేషన్ లెక్కలకు సూటయ్యే కుర్రాడు పంతేనన్నది బలంగా వినిపిస్తోన్న వాదన. రిషబ్ రాక ఒకే అయినా, టీమిండియాను భయపెడుతున్న మరో పెద్ద సమస్య కెప్టెన్ కోహ్లీ ఫిట్‌నెస్. సానుకూల వాతావరణంలో జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సాధించాడని, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యాలు చేతి గాయాల నుంచి కోలుకున్నారన్న వార్తలు ఒకింత ఉపశమనమే అయినా, క్రీజ్‌లోకి కోహ్లీ దిగుతాడా? లేదా? అన్నదే ఉత్కంఠ రేపుతోంది. లార్డ్స్ గేమ్‌లో వెన్నునొప్పితో విలవిల్లాడిన కోహ్లీ థర్డ్ టెస్ట్‌కు ఫిట్‌నెస్ సాధించగలనన్న నమ్మకం వ్యక్తం చేసినా, ఆట ముగిసే వరకూ జట్టుకు తోడుండగలడా? లేదా? అన్నది అనుమానమే. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్‌తో ‘టాస్’ ఫేస్ చేయడానికి కోహ్లీయే వస్తాడన్న నమ్మకాలు మాత్రం బలంగానే కనిపిస్తున్నాయి. అవరోధాలను అధిగమించి ‘ట్రెంట్’ సెట్ చేయడానికి పరిస్థితులన్నీ సానుకూలంగా మారుతున్న సమయంలో గత వైఫల్యాలపైనా టీమిండియా దృష్టిపెట్టక తప్పదు. ఇద్దరు స్పిన్నర్లకు అవకాశమిచ్చి లార్డ్స్‌లో చేసిన తప్పునే మళ్లీ చేస్తారా? లేక వ్యూహాత్మక మార్పులతో కాంబినేషన్‌కు కొత్త రూపమిస్తారా? అన్నది చూడాలి. విఫలమవుతున్న టాప్ ఆర్డర్‌లో మార్పులు చేపడతారా? లేదా? అన్నదీ ఆసక్తి రేపుతోంది. ఉదాహరణకు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌తో ఆడిన పది టెస్ట్ ఇన్నింగ్స్‌లో మురళీ విజయ సాధించిన స్కోరు కేవలం 128 పరుగులు. అంటే సరాసరి 12.8. అయితే అనుభవమున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఈ ఒక్కసారి మరోసారి మురళికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. శిఖర్ ధావన్ పరిస్థితీ ఇందుకు భిన్నమేమీ కాదు. ఈ ఏడాది సౌతాఫ్రికా, ప్రస్తుత ఇంగ్లాంట్ టూర్‌లో అతని సరాసరి 17.5. నాలుగు టెస్ట్‌లో మొత్తం సరాసరి 20.12 పరుగులు. అయితే గతంలో 68.93, 57.29 స్ట్రైక్ రేట్ రికార్డుతోవున్న థావన్‌కూ మరో చివరి అవకాశం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. ఎక్స్‌ట్రా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌ను తీసుకొచ్చే ఆలోచన టీం మేనేజ్‌మెంట్‌లో కనిపించడం లేదుకనుక, నాటింగ్‌హామ్‌లోనూ కరుణ్ నాయర్‌కు చాన్స్ రాకపోవచ్చు. 2014లో ట్రెంట్‌బ్రిడ్జి మైదానంపై భారత్ -ఇంగ్లాండ్ జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండు ఇన్నింగ్స్‌లో భారత్ 457, 391/9తో డిక్లేర్ చేస్తే, తొలి ఇన్నింగ్స్‌లో 496 పరుగులు ఇంగ్లాండ్ చేసింది. సమయాభావంతో మ్యాచ్ డ్రా అయ్యింది. అంటే ట్రెంట్ బ్రిడ్జి భారత్‌కు అనుకూలమనే చెప్పొచ్చు. ఇక వాతావరణం సైతం మొదటి నాలుగు రోజులు పొడిగానే ఉండొచ్చని అంచనా. ఇదిలావుంటే ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్ల ఎంపిక విషయంలో తలపోట్లు ఎదుర్కొంటోంది. వ్యక్తిగత కేసు కారణంగా కొద్దిరోజులుగా జట్టుకు దూరంగావున్న బెన్ స్టోక్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. గురువారం ఎక్కువ సమయం ప్రాక్టీస్ సెషన్‌లో గడిపిన స్టోక్స్‌ను జట్టులోకి తీసుకుంటే, క్రౌడ్‌నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న భయం ఇంగ్లీష్ సెలెక్టర్లకు లేకపోలేదు.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పూజారా, అజింక్యా రహానె, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), అలాస్టిర్ కూక్, కీటన్ జెన్నింగ్స్, జోనీ బెయిర్‌స్టో, జాస్ బట్లర్, ఓలివర్ పోప్, మొరుూన్ ఆలి, ఆదిల్ రషీద్, జామీ పోర్టర్, శామ్ కురన్, జేమ్స్ ఆండర్సన్, స్టార్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్.