క్రీడాభూమి

బ్రేవో.. భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా: భారత అథ్లెట్లు పోరాట పటిమను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. అనుభవం గడించిన సూపర్‌స్టార్లు ఖ్యాతిని నిలుపుకునే రోజు వచ్చింది. కామనె్వల్త్ గేమ్స్ తరువాత భారత అథ్లెట్లు తన సత్తా చాటే వేదిక సిద్ధమైంది. ఇండోనేసియా ఆతిథ్యంలో 18వ ఆసియా గేమ్స్ శనివారం నుంచి జకర్తా, పాలెంబాగ్‌లో అట్టహాసంగా మొదలవుతున్నాయి. ఏడాదికాలంగా అథ్లెట్ల ఎంపికపై అలకలు, కోర్టు కేసులు, అసహజ వివాదాలు, తలనొప్పి వ్యవహారాలు ముగిసి... మొత్తానికి 804మంది అథ్లెట్లతో కూడిన అధికారుల జింబో జట్టు జకార్తాలో అడుగుపెట్టింది. క్రీడా సంరంభానికి ఆరంభ సంకేతంగా నేడు నిర్వహించే ఓపెనింగ్ సెర్మనీ తరువాత ఎంతమంది అథ్లెట్లు తమ సత్తా చాటుకుంటారన్న ఆసక్తి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. కొన్ని టీం ఈవెంట్ల ఆరంభ మ్యాచ్‌ల్లో ఇప్పటికే భారత జట్లు తడబడుతుంటే అనుమానాలు ముసురుతున్నాయి. నిజానికి భారత అథ్లెట్లను తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదు. ఇంతకుముందు జరిగిన గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్ సహా గత ఆసియా గేమ్స్‌లోనూ అథ్లెట్లు పతకాల పంట పండించారు. 2014 ఆసియా గేమ్స్‌లో చైనా, జపాన్, కొరియా అథ్లెట్లకు తీసిపోని విధంగా 11 పసిడి సహా మొత్తం 57 పతకాలు సాధించారు. ఇప్పుడు భారత అథ్లెట్ల బృందం సంఖ్య 572కి చేరింది. మరిన్ని పతకాలు సాధించగలరన్న నమ్మకాలు పెరుగుతున్నాయి. ఖాయంగా పతకాలు సాధించగలరన్న అథ్లెట్ల జాబితాలో పదహారేళ్ల స్కూల్ పిల్ల మనుభాస్కర్ (షూటింగ్, హర్యానా) నుంచి అనుభవం గడించిన సీనియర్లు సుశీల్ కుమార్ (రెజ్లింగ్), నీరజ్ చోప్రా (జావెలిన్)లూ ఉన్నారు. స్ప్రింట్ సెనే్సషన్ హిమదాస్, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, కె శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా, వినేష్ పొగట్‌లాంటి ఉడుకు రక్తం చైనా, థాయిలాండ్, జపాన్ అథ్లెట్లకు సరైన సమాధానం ఇవ్వగలవాళ్లే. ఇక హాకీలో భారత్‌కు స్వర్ణం ఖాయమన్న ధీమా ఉంది. టోక్యో ఒలింపిక్ 2020కే గురిపెట్టిన భారత హాకీ జట్లు ఆసియా గేమ్స్‌లో ఖాయంగా పసిడి పతకాలనే తెస్తాయన్న నమ్మకం ఉంది. బాక్సింగ్‌లో వికాస్ కృష్ణన్, శివ తాప, గౌరవ్ సోలంకి, సర్జుబాలాదేవి, టేబుల్ టెన్నిస్‌లో మనేకా బాత్రా, జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్.. ఇలా ఒకరేమిటి వ్యక్తిగత ఈవెంట్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో సైతం భారత్ బలానికి తక్కువేం లేదు. ఆసియా గేమ్స్‌లో మెరుగైన ఫలితాలతో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తారని, ప్రపంచ దేశాలకు మన క్రీడా సత్తా చాటుతారని ఆశిద్దాం.