క్రీడాభూమి

పసిడి పైనే ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 18: 18వ ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్ల పతకాల వేట ఆసక్తికరంగానే సాగనుంది. నేటినుంచి టీం కాంపిటీషన్ మొదలవుతున్న నేపథ్యంలో భారత జట్లు మానసికంగా సిద్ధమవుతున్నారు. 1986లో ప్రకాష్ పడుకొనె, విమల్‌కుమార్‌ల ద్వయం సాధించిన రజతం తరువాత, పతకాల కరవుతో అల్లాడుతున్న భారత్‌కు సైనా నెహ్వాల్, సింధు ద్వయం ఊరటనిచ్చింది. 2014 ఆసియా గేమ్స్‌లో రజతాన్ని సాధించి భారత దాహార్తిని చల్లార్చారు. 1966 నుంచీ ఇప్పటి వరకూ 8 రజత పతకాలు సాధించి భారత షట్లర్లు, ఈసారి ఖాయంగా పసిడిని ఒడిసి పట్టగలరన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో వ్యక్తిగత మ్యాచ్‌లు ఆగస్టు 23నుంచి మొదలవుతాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, అశ్వినీ పొన్నప్ప, ఎన్ సిక్కిరెడ్డిలు ప్రస్తుత గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య పెంచుతారన్న అంచనాలు లేకపోలేదు. నేడు మాల్దీవుల జట్టుపై భారత జట్టు గెలిస్తే, ఇండోనేసియాతో నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడుతుంది.