క్రీడాభూమి

గురి తప్పని గన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 18: ఆసియా గేమ్స్‌లో తమ గన్స్ గురితప్పే అవకాశమే లేదన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు కుర్ర ప్రతిభావంతులు అనీష్ భన్వాలా, మను భాస్కర్, ఎల్వెనీల్ వలరివన్లు. ఆసియా గేమ్స్‌లో నేటినుంచి మొదలవుతున్న షూటింగ్ ఈవెంట్ ఆరంభంలోనే చైనా, సౌత్ కొరియా షూటర్లను ఎదుర్కోడానికి సంసిద్ధులవుతున్నారు. గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్‌లో 25మీటర్ల రాపిడ్ ఫైర్ ఫిస్టల్, 10మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్లలో పసడి పతకాలు సాధించి లైమ్‌లైట్‌లోకి వచ్చిన భన్వాలా, మనుభాస్కర్ వయసు ఇంకా పదిహేను, పదహారే. అయితే కామనె్వల్త్ కంటే కాస్త వత్తిడి అధికంగావుండే ఆసియా గేమ్స్‌లో వీరి సామర్థ్య ప్రదర్శన ఏమేరకు ఉంటుందన్న ఆసక్తి రేకెత్తుతోంది. కామనె్వల్త్‌లో ఏడు బంగారు పతకాలు సాధించిన భారత్, ఆసియా గేమ్స్ చరిత్రలోనూ ఏడు బంగారు పతకాలు సాధించిన రికార్డుతోనే ఉంది. యువ ప్రతిభావంతులతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 18వ ఆసియా గేమ్స్‌తో పెరిగే అవకాశం ఉందని భావిద్దాం.