క్రీడాభూమి

డబుల్స్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్, ఆగస్టు 18: ఆసియా గేమ్స్‌లో టెన్నిస్ ‘షో’ ఆరంభానికి 24 గంటల ముందు భారత ‘జట్లు’ ఖరారయ్యాయి. ఆసియా గేమ్స్‌నుంచి సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ చివరి క్షణంలో తప్పుకోవడంతో ఎవరెవరు జోడీ కట్టాలన్న దానిపై సందేహాలు అలముకున్నాయి. ఆదివారం నుంచి టీం మ్యాచ్‌లు ఆరంభమవుతున్న నేపథ్యంలో శనివారం ‘డబుల్స్’ జట్లను ఖరారు చేశారు. పేస్ తప్పుకోవడంతో పురుషుల విభాగంలో రోహన్ బొపన్న- దివిజ్ శరణ్‌లు భారత డబుల్స్‌గా బరిలోకి దిగుతారు. ప్రజ్‌నీష్ గునే్నశ్వరన్ సహా రామ్‌కుమార్ రామనాథన్ సింగిల్స్ ఆడుతూనే, పురుషుల డబుల్స్‌లో సుమిత్ నాగోల్‌తో జోడీ కట్టనున్నాడు. గేమ్స్‌కు స్టార్ రాకెట్ సానియా మీర్జా దూరంగా ఉండిపోవడంతో, మహిళల డబుల్స్‌లోనూ చిత్రమైన పరిస్థితి తలెత్తింది. అంకితా రైనా, కర్మన్ కౌర్ తండిలు వ్యక్తిగత విభాగంలో ప్రత్యర్థులుగా పోటీ పడుతూనే, బోపన్న, శరణ్‌లతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడతారు. మహిళల డబుల్స్‌లో మరో జట్టుగా రితుజ భోన్సాలె, ప్రంజన యడ్లపల్లి ఖరారయ్యారు. ర్యాంకులను దృష్టిలో పెట్టుకోకుండా, గెలుపు లక్ష్యంతో కాంబినేషన్లను నిర్ణయించామని కోచ్ జీషన్ అలి స్పష్టం చేశాడు.