క్రీడాభూమి

టార్గెట్ టోక్యో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 18: మాజీ ప్రపంచ చాంపియన్, 9వ ర్యాంకర్ హోదాలో బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా గేమ్స్‌నుంచి నేరుగా టోక్యో 2020 ఓలింపిక్‌కు బెర్త్ రిజర్వు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. 1982 న్యూఢిల్లీ ఆసియా గేమ్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన భారత జట్టు, దక్షిణ కొరియా 1998లో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2014 దక్షిణ కొరియా ఆసియా గేమ్స్ సహా గత తొమ్మిది వేదికలపై ఏదోక పతకాన్ని సాధిస్తూనే ఉంది. 18వ ఆసియా గేమ్స్‌లో భాగంగా పూల్-బిలో నేడు ఆతిథ్యదేశం, 64వ ర్యాంకర్ ఇండోనేసియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. పూల్-బిలో 21న కజకిస్తాన్, 25న కొరియా, 27న థాయిలాండ్ జట్లను భారత్ ఎదుర్కోవాలి. లీగ్ దశలో భారత్ ఎదుర్కోబోయే క్లిష్టమైన జట్టు కొరియానే. అయితే, విజయాలపై భారత మహిళలు సంపూర్ణ విశ్వాసంతో కనిపిస్తున్నారు.