క్రీడాభూమి

కాస్త నిలకడగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 18: సారథి కోహ్లీ నిబ్బరం టీమిండియాకు నిలకడ నేర్పింది. ధర్డ్ టెస్ట్ జరుగుతున్న ట్రెంట్‌బ్రిడ్జి భారత్‌కు కలిసొచ్చింది. చావో రేవో తేల్చుకోక తప్పని స్థితిలో బరిలోకి దిగిన కోహ్లీసేన, ఆచి తూచి పరుగులు తీసింది. శనివారం మొదలైన ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్‌లో భారత్ ఆశాజనకమైన స్కోరుతోనే (307/6, 86 ఓవర్లు) తొలి ఇన్నింగ్స్ ఆడుతోంది. టాప్‌ఆర్డర్ తడబడటంతో ముప్పాతికలోపే మూడు వికెట్లు నష్టపోయినా, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను పూర్తిగా కోహ్లీ, రహానెలు (156 పరుగుల భాగస్వామ్యం) భుజానికెత్తుకున్నారు. క్రీజులో పాతుకుపోయి ఇంగ్లీష్ బౌలర్లను ఆడుకున్నారు. కెప్టెన్ కోహ్లీ సెంచరీ సాధించకుండా కట్టడి చేయడంలో బౌలర్లదే పైచేయి అయ్యింది. అవకాశం కలిసొచ్చి టెస్ట్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ రికార్డు సిక్సర్‌తో కెరీర్ ఆరంభించాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్ (35/65), కెఎల్ రాహుల్ (23/53) ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రీజులో స్థిరపడేందుకు ఓపెనర్లు చేసిన ప్రయత్నాలను క్రిస్‌వోక్స్ దెబ్బకొట్టాడు. 19వ ఓవర్‌లో క్రిస్ వోక్స్ వేసిన 4వ బంతిని ఎదుర్కొన్న ధావన్ (35), స్లిప్‌లోని బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి దిగిన పూజారాను సమన్వయం చేసుకుంటూ పరుగుల వేగం పెంచిన రాహుల్‌ను క్రిస్‌వోక్స్ ఎల్‌బిడబ్ల్యు చేశాడు. వరుసగా రెండు వికెట్లు కూలిపోవడంతో, థర్డ్ వికెట్‌గా దిగిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్నాడు. అదే సమయంలో వోక్స్ బంతి ఆడబోయి ఛెతేశ్వర్ పూజారా (14/31) ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. లంచ్ బ్రేక్ సమయానికి 26 ఓవర్లకు మూడు వికెట్ల నష్టంతో భారత్ 82 పరుగులకు చేరింది. విరామ సమయం తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రహానె చక్కటి ఫాంతో కోహ్లీకి సహకరించాడు. క్రీజుల్లో కోహ్లీ (97/152), రహానె (81/131) పాతుకుపోయి స్కోరును పరుగులు పెట్టించారు. 66వ ఓవర్ చివరి బంతికి రహానే, 76వ ఓవర్ చివరి బంతికి కోహ్లీ వికెట్లను ఆదిల్ రషీద్, బ్రాడ్‌లు పడగొట్టడంతో టీమిండియా పనైపోయిందనే అనుకున్నారు. అయితే క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా (18/58), రిషబ్ పంత్ (22/32 నాటౌట్) స్కోరు వేగాన్ని అదేస్థాయిలో తీసుకెళ్లారు. జేమ్స్ ఆండర్సన్ 8 మెయిడిన్‌లతో 22 ఓవర్లకు 52 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకుంటే, స్టార్ట్ బ్రాడ్ 6 మెయిడిన్‌లతో 21 ఓవర్లలో 64 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. క్రిస్ వోక్స్ చక్కని ఇన్‌స్వింగ్‌లతో 2మెయిడిన్‌లతో 20 ఓవర్లలో 75 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుంటే, బెన్ స్టోక్స్ ఒక మెయిడిన్‌తో 15 ఓవర్లలో 64 పరుగులిచ్చాడు. మరో మూడు ఓవర్లు ఉన్నాయనగా తొలి ఇన్నింగ్స్‌ను శనివారానికి ముగించారు. థర్డ్ టెస్ట్‌లో భారత్ ముగ్గురు ఆటగాళ్లను మారిస్తే, ఇంగ్లాండ్ రెండు మార్పులు చేసింది. ఫాం ప్రదర్శించలేకపోయిన దినేశ్ కార్తీక్, కులదీప్ యాదవ్, మురళీ విజయ్‌లను పక్కనపెట్టి రిషబ్ పంత్, బుమ్రా, శిఖర్‌ధావన్‌కు టీమిండియా యాజమాన్యం అవకాశం కల్పించింది. వ్యక్తిగత కేసు విచారణల అనంతరం అందుబాటులోకి వచ్చిన బెన్ స్టోన్‌ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లాండ్, రెండోటెస్ట్‌లో రాణించిన శామ్ కుర్రన్‌ను పక్కనపెట్టింది. తొలుత ఇంగ్లాండ్ -భరత్ మూడో టెస్ట్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్‌కు టెస్ట్ క్యాప్ అందించి కోహ్లీ జట్టులోకి ఆహ్వానించాడు. మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌కు శ్రద్ధాంజలిగా శనివారం భారత ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాడ్జిలు ధరించి ఆటకు దిగారు.