క్రీడాభూమి

అట్టహాసంగా... ఆసియాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేదీప్యమైన వెల్తురు మొగలో తలారుబోసుకున్న వర్ణ సమ్మిళిత సంప్రదాయ సమన్ నృత్యాన్ని ప్రపంచం రెప్పార్పకుండా చూసింది. ప్రపంచ శాంతికి పదం పాడుతూ, ప్రగతి సాధనకు పాదం కదుపుతూ 18వ ఆసియా క్రీడోత్సవ సంరభానికి ఇండోనేసియా వేదికైంది. అధ్యక్షుడు విడోడోకూ తప్పని ట్రాఫిక్ స్థంభనలను అతిశయోక్తిగా చూపుతూ.. కత్తులు దూసుకుంటున్న కొరియన్ల సమైక్యతను చాటుతూ.. ఆసియా దేశాల పతాక రెపరెపలను మీటుతూ.. ఆకాశ పండుగ అవనికి దిగిందా? అన్నట్టు సాగిన ఆరంభం అదిరింది. ఇక ఆసియాట మొదలెట్టండంటూ అధ్యక్షుడు విడోడో చేసిన ప్రకటనతో రేపటి యుద్ధానికి ఈరోజు స్నేహాన్ని బదులిచ్చుకుంటూ వేలాది అథ్లెట్లు మార్చ్ఫిస్ట్ నిర్వహించారు. కేతనాన్ని భుజానికెత్తుకుని అగ్రపథాన నడచిన అథ్లెట్ నీరజ్ చోప్రాను భారత బృందం అనుసరించిన దృశ్యం అద్భుతం.
మనమంతా వైవిధ్యాన్ని వేడుక చేసుకుందాం. మనమంతా భిన్నత్వాన్ని ఏకం చేద్దాం. మనమంతా మానవత్వాన్ని పంచుకుందాం. ఆసియా గేమ్స్. ఇది మన పండుగ అంటూ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు ఎరిక్ తోహిర్ చేసిన ప్రసంగ ప్రకటన క్రీడాపండుగ విశిష్టతకు అద్దంపట్టింది. ఆరంభ సయ్యాట పూరె్తైంది. నేటినుంచి ఆసియాటలు ఆరంభమవుతున్నాయ. క్రీడాభిమానులకు కంటినిండా ఆనందమే.