క్రీడాభూమి

పసిడి పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 20: భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ చరిత్ర సృష్టించింది. 18వ ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. మెడల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఫొగట్, ఆదివారం 50 కేజీ విభాగం ఫ్రీస్టైల్ ఫైనల్స్‌లో జపాన్ ప్రత్యర్థి యుకి ఇరీని 6-2తో మట్టికరిపించింది. దంగల్ ఫేమ్ ఫొగట్ కుటుంబానికి చెందిన 23ఏళ్ల హర్యానా ఫైర్‌బ్రాండ్‌కు స్వర్ణం ఖాయమన్న అంచనాలు ఆదినుంచీ వినిపిస్తున్నవే. రెండేళ్ల క్రితం రియో ఒలింపిక్స్ పసిడి పోరులో చైనీస్ రెజ్లర్ యనన్ సున్ చేతిలో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకున్న ఫొగట్,
తాజా ఆసియా గేమ్స్‌లో ప్రతీకారం తీర్చుకుంది. యనన్ సున్‌తో జరిగిన బౌట్‌లో 8-2 స్కోరుతో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తరువాత కొరియా రెజ్లర్ హ్యూంగ్జూ కిమ్‌నూ 75 క్షణాల్లో మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఉజ్బెకిస్తాన్ రెజ్లర్‌నూ చిత్తుచేసి ఫైనల్లో జపాన్ రెజ్లర్ ఇరీని ఓ పట్టుపట్టింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్షణాల్లో బౌట్లను ముగించిన పొగట్, స్వర్ణాల వేటలో భారత్ సంఖ్యను పెంచింది. తాజా విజయంతో రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా, ఆసియా గేమ్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన రెజ్లింగ్ యోధురాలిగా ఫొగట్ పేరు చరిత్రకెక్కింది.