క్రీడాభూమి

ఖాయమైన గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రెంట్‌బ్రిడ్జి, ఆగస్టు 20: ఇంగ్లీష్ బంతులను టీమిండియా ఉతికి ఆరేసింది. పేసర్లు, స్పిన్నర్లన్న తారతమ్యం లేకుండా ప్రతి బంతినీ జాగ్రత్తగా ఆడుతూ 520 పరుగుల అత్యధిక ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ కోహ్లీ సెంచరీ, పూజారా బాధ్యతాయుత పరుగులు భారత్‌ను గెలుపు అంచుల్లోకి తీసుకెళ్ళాయి. అద్భుతమేదైనా జరిగితే తప్ప థర్డ్ టెస్ట్ భారత్ నుంచి చేజారడం అసాధ్యం. దాదాపు విజయం అంచులకు చేరిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో మూడో రోజు ముగింపు సమయంలోనే ఇంగ్లాండ్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలైంది. అలసిపోయిన ఆటగాళ్లను త్వరగా పెవిలియన్‌కు పంపే ఉద్దేశంతో సారథి కోహ్లీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడంతో ఇంగ్లాండ్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. ఓపెనర్లుగా అలిస్టర్ కూక్ (9- 28 బంతుల్లో), కీటన్ జెన్నింగ్స్ (13- 27 బంతుల్లో) బ్యాటింగ్ మొదలుపెట్టారు.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో రెండు టెస్ట్‌లు చేజార్చుకుని 0-2తో ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలోకి దిగిన భారత్, థర్డ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌తోనే ఇంగ్లాండ్‌పై వత్తిడి పెంచింది. రెండో రోజే రెండో ఇన్నింగ్స్‌నూ మొదలెట్టి ధాటిగా ఆడుతూ భారీ ఆధిక్యతతో ఇంగ్లాండ్‌ను ఓటమి అంచులకు నెట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 124/2తో మూడో రోజు ఆదివారం బ్యాటింగ్ ఆరంభించిన కోహ్లీ సేన 352/7 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ అప్పగించింది.
తొలుత క్రీజులో పాతుకుపోయిన భారత బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇంగ్లీష్ ఆటగాళ్లను విసిగించి అలసిపోయేలా చేయాలన్న సారథి కోహ్లీ వ్యూహం పూర్తిగా ఫలించింది. నైట్ వాచ్‌మన్‌గా మూడోరోజు ఆటకు దిగిన సారథి విరాట్ కోహ్లీ (103- 197 బంతుల్లో), నయావాల్ ఛెతేశ్వర్ పూజారా (72- 208 బంతుల్లో) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ఠ స్థితికి చేర్చారు. కవర్ డ్రైవ్‌లతో కోహ్లీ స్కోరును పరిగెత్తిస్తే, నిలకడ ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లను పూజారా విసిగించాడు. 72వ ఓవర్లో 224 పరుగుల వద్ద స్టోక్స్ బంతికి కూక్‌కు క్యాచ్‌ఇచ్చి పూజారా పెవిలియన్ పట్టడంతో ఇంగ్లాండ్‌లో కొంత ఉత్సాహం కనిపించింది. 94వ ఓవర్‌లో 281 పరుగుల వద్ద కోహ్లీని వికెట్లముందు స్టోక్స్ దొరకబుచ్చుకున్నాడు. దీంతో టీమిండియా స్కోరుకు మళ్లీ బ్రేకులుపడ్డాయి. క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ (1)ను ఒక్క పరుగు తేడాతో ఆండర్సన్ పెవిలియన్‌కు పంపడంతో, అజింక్య రహానె (29- 94 బంతుల్లో), మహ్మద్ షమి (3- 6 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (52 -52 బంతుల్లో, నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (1- 1బంతి, నాటౌట్) ఇన్నింగ్స్ కొనసాగించారు.

చిత్రం..కెప్టెన్ కోహ్లీ సెంచరీ ఆనందాన్ని పంచుకుంటున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానె