క్రీడాభూమి

పాండ్యానే.. కపిల్‌ను కాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రెంట్‌బ్రిడ్జి, ఆగస్టు 20: ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో నన్ను కపిల్‌దేవ్‌తో పోలుస్తున్నారు. లెజెండ్స్‌తో పోలిక బావుంటుంది. కానీ, పొరబాటున ఎప్పుడైనా విఫలమైతే పోలికలు తెచ్చినోళ్లే పోట్లేసి చంపేస్తారు. ప్లీజ్.. ననె్నవరితోనూ పోల్చకండి. నేను కపిల్‌దేవ్ కావాలని అనుకోవట్లేదు. హార్దిక్ పాండ్యాలాగే ఉండాలనుకుంటున్నా. అలా ఉండటానికే ఇష్టపడతా. 40 వనే్డలు, 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది హార్దిక్ పాండ్యానే, కపిల్‌దేవ్‌లా కాదు. దయచేసి ఎవ్వరితోనూ పోల్చొద్దు. నేను నాకులా ఉండటమే ఇష్టం. నేను పొగిడేవాళ్ల కోసమో, విమర్శకుల కోసమో క్రికెట్ ఆడటం లేదు. తెలిసో తెలియకో వాళ్లు చేస్తున్న పనులకు ఎంతోకొంత రావొచ్చు. కానీ, నేను సరైన పనే చేయాలనుకుంటున్నా. నా దేశం కోసం క్రికెట్ ఆడుతున్నా. నా ఆట తీరుతో జట్టు సంతృప్తికరంగా ఉంది. ఇంతకుమించి ఏ విషయాన్నీ పట్టించుకోవాలని అనుకోవడం లేదు.
(థర్డ్ టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన హార్దిక్ పాండ్యాను కపిల్‌తో పోలుస్తూ కథనాలు వచ్చాయి. దీంతో తనను ఎవ్వరితోనూ పొల్చొద్దంటూ పాండ్యా స్పందించిన తీరిదీ..)