క్రీడాభూమి

స్వర్ణం.. సౌరభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్/ జకార్తా, ఆగస్టు 21: 18వ ఆసియా గేమ్స్‌లో భారత షూటర్లు భళా అనిపిస్తున్నారు. మంగళవారం మరో మూడు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో పదహారేళ్ల కుర్ర షూటర్ సౌరబ్ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. మీరట్‌కు చెందిన రైతు కొడుకు సౌరబ్ దిగ్గజ షూటర్లను వెనక్కినెట్టి అత్యధిక పాయింట్లతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. మీరట్‌కు సమీపంలోని పల్లెలో బాల్యం సాగించిన సౌరబ్, తీర్థాల్లో బెలూన్లు పేల్చడానికి ఇష్టపడేవాడు. అలా షూటింగ్‌పట్ల మక్కువ పెంచుకున్న సౌరబ్, ఇప్పుడ స్వర్ణానికే గురిపెట్టి సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక 50 మీటర్ల రైఫిల్ (3 పొజిషన్స్) విభాగంలో సీజన్డ్ షూటర్, మాజీ నేవీ ఉద్యోగి సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని సాధించాడు. రేప్ కేసును ఎదుర్కొంటూ భారత స్పోర్ట్స్ అథారిటీలో అసిస్టెంట్ కోచ్ విధుల నుంచి బహిష్కరణకు గురైన మాజీ నేవీ ఉద్యోగి ‘క్రీడలు ముగిసే సరికి 8.4 పాయింట్లు సాధిస్తానన్న నమ్మకముంది. ఆ లక్ష్యమే నాకు పసిడిని అందిస్తుంది. వాతావరణం, గాలివాటమే కాదు, పోటీ కూడా ఈసారి సవాల్‌గానే ఉంది. అథ్లెట్‌గా నా సామర్థ్యానికి తిరిగి ఉద్యోగం లభిస్తుందనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో చూడాలి’ అన్నాడు. ఇక పదిమీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మరో భారత షూటర్, 29ఏళ్ల అభిషేక్ వర్మ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్ రెజ్లింగ్ 68 కేజీ విభాగంలో 20ఏళ్ల భారత రెజ్లర్ దివ్యకక్రన్ కాంస్యాన్ని సాధించింది. థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ బౌట్‌లో 10-0 స్కోరుతో తైపీ రెజ్లర్ చెన్ వెన్లింగ్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన దివ్య కక్రన్, మంగోలియన్ రెజ్లర్ టుమెన్‌ట్సెట్సెంగ్ షర్ఖూ చేతిలో ఓటమిపాలైంది. అయితే, రెపిచెజ్‌కు ఎవరికీ అవకాశం లేకపోవడంతో దివ్య కక్రన్‌కు కాంస్యం ఖరారైంది.
సెమీఫైనల్స్‌లో ఓడి పతకాన్ని దక్కించుకుంది భారత సెపక్ తక్రా జట్టు. ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెపక్ తక్రాలో భారత్ పతకం సాధించడం ఇదే తొలిసారి. మంగళవారం సెమీఫైనల్స్‌లో థాయిలాండ్ జట్టుతో తలపడిన భారత జట్టు 0-2 స్కోరుతో ఓటమిపాలై కాంస్యాన్ని ఖరారు చేసుకుంది. ‘్భరత జట్టు కేవలం రెండు నెలలు థాయిలాండ్‌లో శిక్షణ తీసుకుని కాంస్యాన్ని సాధించింది. సెపక్ తక్రాను ప్రాధాన్యతా క్రీడగా ప్రభుత్వం పరిగణించి సహకరిస్తే భారత జట్టు అత్యుత్తమ ఫలితాలు చూపగలదనడంలో సందేహం లేదు’ అని చీఫ్ కోచ్ హేమ్‌రాజ్ వ్యాఖ్యానించాడు. పతకాల వేటపై దృష్టిపెట్టిన భారత అథ్లెట్లు ఆసియా వేదికలపై అలుపెరుగని కృషినే సలుపుతున్నారు. వుషు క్రీడకు సంబంధించి 60 కేజీ మహిళా శాండా ఈవెంట్‌లో సెమీస్‌కు చేరిన భారత్ అథ్లెట్ ఎన్ రోషిబిని దేవి ఖాయంగా పతకం సాధించనుంది. మరో నాలుగు ఈవెంట్లలోనూ భారత అథ్లెట్ల జట్టు సెమీస్‌కు చేరుకుంది. సెమీస్‌లో విఫలమైనా కాంస్యం ఖాయం. కబడ్డీలోనూ పురుషుల, మహిళల జట్లు మంగళవారంనాటి మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదించారు. ఆర్చరీ అథ్లెట్లు వ్యక్తిగత, టీం ఈవెంట్లలో దూసుకెళ్తున్నారు. దీపిక, ప్రొమీలా డైమెరీ, అంకిత భకత్, లక్ష్మీరాణి మజ్హి తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మహిళా హాకీ జట్టు తిరుగులేని ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తోంది. మంగళవారం గ్రూప్ మ్యాచ్‌లో 21-0 స్కోరుతో కజకిస్తాన్‌పై అప్రతిహత విజయం సాధించింది. టెన్నిస్‌కు సంబంధించి భారత టాప్‌సీడ్లు రోహన్ బొపన్న, ద్విజి శరణ్‌లు మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా తుది ఎనిమిది స్థానాల్లో చోటు దక్కించుకుంది. ఒలింపిక్‌లో నాలుగోస్థానం సాధించి లైమ్‌లైట్‌లోకి వచ్చిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పెట్ వాల్ట్ ఈవెంట్ ఫైనల్స్‌లో విఫలమైంది. బీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో 7వ స్థానం సాధించి, పతకంపై ఆశలు చిగురింప చేస్తోంది. స్విమ్మింగ్ 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో భారత స్విమ్మర్ వర్థవాల్ ఖడే క్షణంలో వందోవంతు సమయంలో పతకాన్ని చేజార్చుకున్నాడు. జాతీయస్థాయి రికార్డును అధిగమించి సామర్థ్యం కనబర్చినా, పతకం మాత్రం అతన్ని వరించలేదు. వాలీబాల్ పూల్-బి ప్రాథమిక మ్యాచ్‌లో భారత మహిళా జట్టుకు రెండోసారీ ఓటమి తప్పలేదు. వియత్నాం జట్టుపై హోరాహోరీ పోరు సలిపినా, చివరిక్షణాల్లో ప్రత్యర్థుల ఎదురుదాడి ముందు భారత జట్టు నిలవలేకపోయింది. హ్యాండ్‌బాల్ పూల్-ఏలో నాలుగో మ్యాచ్‌లో ఉత్తర కొరియాపై ఓడిన భారత మహిళా జట్టు బరినుంచే నిష్క్రమించింది.

చిత్రాలు..*జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ విన్యాసం
*గురి చూస్తున్న భారత షూటర్ రాజ్‌పుత్