క్రీడాభూమి

ఓటమి అంచుల్లో ఇంగ్లాండ్‌ను వేటాడి, వెంటాడిన కోహ్లీ సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రెంట్ బ్రిడ్జి, ఆగస్టు 21: ట్రెంట్ బ్రిడ్జిలో గిరాటపర్వం దాదాపు ముగిసింది. థర్డ్ టెస్ట్‌లో చావో రేవో తేల్చుకోడానికి దిగిన టీమిండియా, జో సైన్యాన్ని రేవెట్టేసింది. విరాట సేన విజృంభణ ముందు ఇంగ్లీష్‌వీరులు తలొంచేశారు. 520 పరుగుల ఆధిక్యాన్ని అధిగమించలేని పోరాటంతో విజయాన్ని దాదాపు భారత్‌పరం చేశారు. నాలుగోరోజు మంగళవారం ఉత్సాహంగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (13, 31 బంతుల్లో), అలిస్టర్ కుక్ (17, 39 బంతుల్లో)లను ఇషాంత్ శర్మ మొదట్లోనే కుప్పకూల్చేశాడు. దీంతో 23/0 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. 32 పరుగుల స్కోరువద్ద రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లీష్ జట్టు, 62 పరుగులు దాటకుండానే బుమ్రా, షమి బంతులకు జోరూట్ (13-40 బంతుల్లో), ఓల్లీ పోప్ (16-39 పరుగుల్లో) వికెట్లు పొగొట్టుకుని పీకల్లోతు కష్టాల్లోపడింది. తరువాత క్రీజులోకి వచ్చిన జాస్ బట్లర్ (106 -176 బంతుల్లో), బెన్ స్టోక్స్ (62-187 బంతుల్లో)లు పాతుకుపోయారు. టీమిండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగుల వరద సృష్టించి స్కోరును 231కి చేర్చారు. అయితే కోహ్లీసేన ఎక్కడా కంగారు పడలేదు. ఆ సమయంలో రెట్టించిన కసితో బుమ్రా విసిరిన బంతికి జాస్ బట్లర్, హార్దిక్ పాండ్యా బంతికి బెన్ స్టోక్స్ దొరికిపోవడంతో గిరాటపర్వం ముగిసిపోయింది. తరువాత భారత బౌలర్ల ధాటికి తోక బ్యాట్స్‌మెన్లు నిలవలేకపోయారు. జానీ బెయిర్‌స్టో (0), క్రిస్ వోక్స్ 4-3), స్టార్ట్ బ్రాడ్ (20-29 బంతుల్లో) వరుస వికెట్లు ఇచ్చేయడంతో ఇంగ్లాండ్ ఓటమి అంచుల్లోకి చేరింది. 311/9 వికెట్ల వద్ద నాలుగోరోజు ఆటను ముగించారు. అప్పటికి జేమ్స్ ఆండర్సన్ (8-16), ఆదిల్ రషీద్ (30-55) క్రీజులో ఉన్నారు.

చిత్రం..బెన్‌స్టోక్స్ వికెట్‌ను కుప్పకూల్చిన హార్దిక్ పాండ్యాను భుజానికెత్తుకుంటున్న టీమిండియా