క్రీడాభూమి

అమల్లోకి బీసీసీఐ కొత్త రాజ్యాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: బీసీసీఐ తన కొత్త రాజ్యాంగాన్ని చెన్నైలోని తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) బీసీసీఐ ఎన్నికల నిర్వహణకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం నియమించిన జస్టిస్ లోథా కమిటీ బీసీసీఐ పాత రాజ్యాంగంలో పలు సంస్కరణలు సూచించిన విషయం తెలిసిందే. ‘2018 ఆగస్టు 9న సుప్రీం కోర్టు ఖరారు చేసిన సంస్కరణల సూచనలతో కూడిన బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సీఇవో రాహుల్ జాహ్రి నేతృత్వంలో చెన్నైలోని తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘బీసీసీఐ విధివిధానాల పరిస్థితిని చక్కదిద్దినందుకు సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. కొత్త రాజ్యాంగ ప్రక్రియను ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ సీవోఏలో భాగమైన చైర్మన్ వినోద్ రాయ్, డయానా ఎడుల్జి ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇక కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది. త్వరలోనే ఎన్నికల నిర్వహణకు రోడ్‌మ్యాప్‌ను నిర్దేశిస్తాం’ అని రాయ్ పేర్కొన్నారు.