క్రీడాభూమి

కౌంటీ గేమ్‌లే బలాన్నిచ్చాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్: వరుసగా ఇంగ్లీష్ కౌంటీలు ఆడటం ప్రస్తుత ఇంగ్లాండ్ టెస్ట్‌లో తనకెంతో ఉపకరించిందని భారత బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పూజారా అన్నాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ఫాంలో లేకపోవడంతో వత్తిడికి గురైన మాట వాస్తవమని, అయితే ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇంగ్లీష్ కౌంటీల్లోని అనుభవమే ఉపకరించిందన్నాడు. థర్డ్ టెస్ట్ మలి ఇన్నింగ్స్‌లో 72 పరుగుల స్కోరుతో 113 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లీతో కలిసి అందించటం తెలిసిందే. ‘కౌంటీలే నాకు సహాయపడ్డాయి. కౌంటీల్లో ఎక్కువ పరుగులు చేయకపోవచ్చు కానీ, ఛాలెంజింగ్ పిచ్‌లపై ఆడటం తెలుసుకున్నా. నెట్ ప్రాక్టీసులు సహా అవే నాలో మానసిక ధైర్యాన్ని నింపాయి’ అని వ్యాఖ్యానించాడు.