క్రీడాభూమి

కేరళకు అంకితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, ఆగస్టు 22: ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా సాధించిన విజయాన్ని కెపెక్టన్ కోహ్లీ కేరళకు అంకితమిచ్చాడు. ‘అనూహ్య వరదలతో అతలాకుతలమైన కేరళ వరద బాధితులకు ఈ విజయాన్ని అంకితం ఇవ్వాలని టీమిండియా నిర్ణయించింది. భారత క్రికెట్ జట్టుగా మా వంతు మేం చేయగల సాయమిది. అక్కడి పరిస్థితులు విషమంగా ఉన్నాయి’ అని 203 పరుగుల ఆధిక్యంతో గెలిచిన తరువాత కోహ్లీ ప్రకటించాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణ ఓటములు చవిచూసిన కోహ్లీసేన, మూడో టెస్టులో గెలుపుతో సిరీస్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించింది. ప్రజెంటేషన్ సెర్మనీలో కెప్టెన్ కోహ్లీ ఈ ప్రకటన చేయగానే అభిమానులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో 300 వరద మరణాలు నమోదుకావడం తెలిసిందే.