క్రీడాభూమి

భళా.. భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్, ఆగస్టు 22: మూడో టెస్ట్ ఆరంభం నుంచీ ఊరిస్తోన్న విజయం ఎట్టకేలకు ఐదో రోజు టీమిండియా వశమైంది. ఇంగ్లాండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో విరాట్ సేన భారీ గెలుపు నమోదు చేసింది. ‘మాపై నమ్మకముంచండి’ అంటూ టెస్ట్ ఆరంభంలో చేసిన ప్రతిజ్ఞను కోహ్లీ నిలబెట్టుకున్నాడు. ఇంగ్లీష్ జట్టును 203 పరుగుల ఆధిక్యంతో చిత్తుచేసి 1-2తో సిరీస్‌పై మళ్లీ ఆశలు రేకెత్తించాడు. థర్డ్ టెస్ట్ ఐదో రోజు ఆట ప్రారంభమయ్యేసరికి, భారత్ గెలుపునకు కావాల్సింది ఒక్క వికెట్ మాత్రమే. ఓవర్‌నైట్ స్కోరు 311/9తో క్రీజులోకి దిగిన నైట్ వాచ్‌మన్లు ఆదిల్ రషీద్, జేమ్స్ ఆండర్సన్లు క్రీజులో ఎంతోసేపు నిలువలేకపోయారు. రవిచంద్రన్ అశ్విన్ విసిరిన కవ్వింపు బంతిని ఆడేందుకు ప్రయత్నించి అజింక్యా రహానెకు జేమ్స్ ఆండర్సన్ (11) క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లీష్ జట్టు కథ ముగిసింది. ఐదోరోజు ఆటలోని చివరి వికెట్‌ను 2.5 ఓవర్లలో చక్కబెట్టేసి, విజయానికి కావాల్సిన ఫార్మాలిటీస్‌ను భారత బౌలర్లు పూర్తి చేశారు. భారత్ నిర్దేశించిన 520 పరుగుల లక్ష్యాన్ని అధిగమించే ప్రయత్నంలో 317 పరుగులకే ఆలౌటైంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఓటమి, లార్డ్స్‌లో ఘోర పరాభవంతో రగిలిపోతున్న టీమిండియాకు నాటింగ్‌హామ్ గెలుపు ఒకింత ప్రతీకార ఉపశమనమే. భారత ఉప ఖండానికి ఆవల ఆడిన మ్యాచ్‌లో చాలాకాలం తరువాత టీమిండియా విభాగాలన్నీ కలిసికట్టుగా ప్రదర్శించిన సామర్థ్యమే విజయానికి అసలు కారణం. ఓపెనర్లు కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ (35, 44) బలమైన ఆరంభాలనే ఇచ్చారు. కొత్త బంతులతో ఇషాంత్ శర్మ (2/32, 2/70), మహ్మద్ షమి (1/56, 1/78) ఇంగ్లీష్ జట్టుపై దాడికి ఉపక్రమించారు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానె (81, 39), టెస్ట్ స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పూజారా (14, 72) సరైన సమయంలో తమవంతు పాత్ర పోషించారు. ఆల్ రౌండ్ ప్రతిభతో హార్దిక్ పాండ్యా (5 వికెట్లు, అర్థ సెంచరీ), సెకెండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా (ఐదు వికెట్లు) ఇంగ్లాండ్ వెన్ను విరిచేశారు. ఇక స్లిప్‌లో 7 క్యాచ్‌లతో కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్ ఓటమికి రూటువేశాడు. ఫస్ట్ చాయిస్ టెస్ట్ కీపర్ వృద్ధిమాన్ సాహ లేని కొరతను తీరుసూత, రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లతో సత్తా చాటాడు. ఇక ఇంగ్లాండ్ జట్టుకు చెమటలు పట్టించింది పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ. తీవ్ర వత్తిడి సమయంలోనూ సహనం కోల్పోకుండా ఇంగ్లాండ్ ఓటమిని శాశించాడు. రెండు ఇన్నింగ్స్‌లో 200 పరుగులతో ఇంగ్లీష్ జట్టు అందుకోలేని ఆధిక్యాన్ని భారత్‌కు అందించాడు. మొదటి, మూడో టెస్ట్‌ల్లో కోహ్లీ సరిగ్గా 200 పరుగులు చేయడం యాధృచ్చికమైతే, 440 పరుగులు అధిగమించడం రికార్డు. ప్రపంచం మొత్తంమీద అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరన్న చర్చకు తన ప్రతిభతో ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్.. ఇలా పర్యాటక దేశమేదైనా కోహ్లీ మార్క్ సెంచరీ ఉండి తీరాల్సిందేనని కూడా నిరూపించాడు. పరుగులు పండించటంలోనే కాదు, అవసరమైతే బౌలర్లను విసిగించేంత ఓపికనూ ప్రదర్శించగలడని థర్డ్ టెస్ట్‌తో ప్రూవ్ చేశాడు. జిమీ ఆండర్సన్ లాంటి సీనియర్ బౌలర్ సైతం కోహ్లీ డిఫెన్స్‌కు ఫిదా అయ్యాడనడంలో అతిశయోక్తి ఉండదు. జట్టునుంచి సకల బలాలూ సమకూర్చుకుని టెస్ట్ విజయం మొత్తాన్ని భుజాన మోసిన విరాట్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. ఇరు జట్లలో సెకండ్ హయ్యస్ట్ స్కోరర్‌గా కోహ్లీ నిలిస్తే, జానీ బెయిర్‌స్టో (206) టాప్ ప్లేస్, టెస్ట్ మెయిడెన్ సెంచరీతో జాస్ బట్లర్ (170) థర్డ్ ప్లేస్‌లో నిలిచాడు. తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా, థర్డ్ టెస్ట్‌లో 160 పరుగులు సాధించి టీమిండియాలో సెకండ్ హయ్యస్ట్ స్కోరర్‌గా గౌరవప్రద పాత్ర పోషించాడు.