క్రీడాభూమి

నాలుగోరోజు.. ఐదు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్/ జకార్తా: ఆసియా క్రీడా వేదికలపై భారత షూటర్లు చెలరేగిపోతున్నారు. ఏకాగ్రతతో పసిడి పతకాలకే గురి పెడుతున్నారు. 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రహి సర్నోబాట్ సాధించిన పసిడితో షూటింగ్‌లోనే ఇప్పటికి భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య రెండుకు చేరింది. ఆసియా వేదికపై షూటింగ్‌లో స్వర్ణమందుకున్న తొలి భారత మహిళగా కొల్హాపూర్‌కు చెందిన డిప్యూటీ కలెక్టర్ రహి రికార్డుకెక్కింది. హోరాహోరీ పోరులో తనతో సమంగా వస్తున్న యాంగ్‌పైబూన్‌కు థర్డ్ సిరీస్ షాట్స్‌లో రహి ఫుల్‌స్టాప్ పెట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. వుషూ క్రీడలోనూ భారత్ తన సత్తా చాటుకుంది. ఫైనల్స్ బరిలో భారత క్రీడాకారులు విఫలమవ్వడంతో, కాంస్యాలకు పరిమితమయ్యారు.
మహిళల 60 కిలోల విభాగంలో చైనా అథ్లెట్ యింగ్‌యింగ్‌తో తలపడిన భారత అథ్లెట్ రోషిబినా దేవి 01తో పరాజయం పాలైంది. పురుషుల 54 కిలోల విభాగంలో వియత్నాం ఆటగాడు ట్రయాంగ్ జియాంగ్ చేతిలో 0-2తో ఓటమి చవిచూసిన భారత ఆటగాడు సంతోష్‌కుమార్ కాంస్యానికే పరిమితమయ్యాడు. 60 కిలోల శాండా విభాగంలో ఇరాన్ యోధుడితో తలపడిన సూర్యభాను ప్రతాప్ మోకాలి గాయంతో బాధపడుతూనే హోరాహోరీ పోరు సలిపాడు. 65 కేజీల విభాగంలో నరేందర్ గ్రెవాల్ 0-2 తేడాతో ఇరాన్ ఆటగాడు జఫారీ చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో విఫలమైన ఆటగాళ్లకు అందచేసే కాంస్యాలను భారత వుషూ ఆటగాళ్లు సాధించారు. రెజ్లింగ్‌లో పురుషుల గ్రెకో-రోమన్ 87 కేజీ విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ కాంస్య పతక బౌట్‌లో విఫలమయ్యాడు. టెన్నిస్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. మెన్స్ డబుల్స్‌లో రోహన్ బొపన్న, దివిజి శరణ్‌లు సెమీఫైనల్స్‌కు చేరితే, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా సెమీస్‌కు చేరుకుంది. రోయింగ్ పురుషుల విభాగంలో రోహిత్ కుమార్, భగవాన్ సింగ్‌లు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. సంజిత డంగ్‌డంగ్, అన్ను, నవనీత్ కౌర్, యామినీ సింగ్ జట్టు ఫైనల్ రేస్‌కు అర్హత సాధించింది. పురుషుల లైట్‌వెయిట్ ఎయిట్ టీం టైటిల్ రేస్‌కు అర్హత సాధించింది. వాలీబాల్ పూల్-ఎఫ్ ప్రారంభ మ్యాచ్‌లో ఖతార్‌పై 0-3 తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. జిమ్నాస్టిక్స్ టీం ఈవెంట్‌లో అరుణా బుడ్డారెడ్డి, ప్రణతి దాస్, ప్రణతి నాయక్, మహీంద్రచౌదరిలు ఏడో రౌండ్‌ను దిగ్విజయంగా పూర్తి చేశారు. టెక్వాండో పురుషుల 80 కేజీ క్వార్టర్ ఫైనల్స్‌లో నవజీత్ మన్ 6-20 స్కోరుతో చైనా ఆటగాడు లింగ్‌లాండ్ చెన్ చేతిలో ఓటమి చవిచూశాడు. ఆర్చరీలో భారత మహిళా జట్టు క్వార్టర్ ఫైనల్ రెండో రౌండ్‌కు అర్హత సంపాదించుకుంది.