క్రీడాభూమి

మరీ ఇన్ని మార్పులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింగ్‌హామ్: టీమిండియా టెస్టు క్రికెట్‌లో చేస్తున్న ప్రయోగాలు, మార్పులు ఆశ్చర్యకరంగా ఉన్నాయని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో భారత జట్టు 38 టెస్టుల్లో 38 మార్పులు చేసిందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తుచేశాడు. 3మరీ ఇన్ని మార్పులా?2 అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నంత కాలం టీమిండియా ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చని అన్నాడు. ప్రతి టెస్టులోనూ మార్పులు చేయడం సరైన విధానం కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. ఒకవేళ కెప్టెన్ మార్పులు అనివార్యమని అనుకుంటే, అతని ప్రతిపాదనలను ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశాడు. మొదటి రెండు టెస్టుల్లో ఓడినప్పటికీ, మూడో టెస్టులో ఎదురుదాడికి దిగి, భారత్ విజయం సాధించిన విధానం అద్భుతమని అన్నాడు. మిగతా రెండు టెస్టుల్లోనూ ఇదే తరహాలో పోరాడి, సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.