క్రీడాభూమి

టీ-20లకు జూలన్ గోస్వామి గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి, పేసర్ జూలన్ గోస్వామి అంతర్జాతీయ టీ-20లకు గుడ్‌బై చెప్పింది. ఈ విషయాన్ని ఆమె గురువారం ఇక్కడ వెల్లడించింది. అయితే, ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టీ-20 మ్యాచ్‌లో మాత్రం ఆడుతుంది. ఇప్పటివరకు 68 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన 35 ఏళ్ల గోస్వామి 56 వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లకు గుడ్‌బై చెప్పినా వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో మాత్రం ఆడతానని ఆమె స్పష్టం చేసింది. వనే్డలలో ఇప్పటివరకు 169 గేమ్‌లు ఆడిన ఆమె 200 వికెట్లు సాధించింది. భారత మహిళా జట్టులో పేస్ బౌలింగ్‌లో ఆరితేరిన క్రికెటర్‌గా ఆమె ఘనత సాధించింది. తన 16 ఏళ్ల క్రీడా జీవితంలో 10 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గోస్వామి 40 వికెట్లు పడగొట్టింది. ‘2007లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఆమె అందుకుంది. టీ-20 మ్యాచ్‌లలో ఇంతవరకు తనకు సహకరించిన సహచర క్రికెటర్లు, మద్దతు పలికిన అభిమానులతోపాటు బీసీసీఐకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.