క్రీడాభూమి

మరో రెండు స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18వ ఆసియా గేమ్స్‌లో భారత్ పసిడి వేటను భారంగానే సాగిస్తోంది. ఒలింపిక్ హెవీవెయిట్ చైనా 66 స్వర్ణాలను కైవసం చేసుకుంటే, భారత్ ఆరో రోజు రెండు స్వర్ణాలు సాధించి ఆరు రోజుల్లో ఆరు పసిడి పతకాలకు పరిమితమైంది. శుక్రవారం భారత సైన్యం తరఫున రోయింగ్ రేస్‌లోకి దిగిన జట్టు అత్యద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్ క్వాడ్రుపుల్ స్కల్స్ ఈవెంట్‌లో చివరి రోజు పసిడి పతకాన్ని సాధించి సైనిక రోవర్లు భారత కేతనాన్ని జకబారింగ్ సరస్సుపై ఎగరేశారు. ఇక టెన్నిస్ పురుషుల డబుల్స్‌లో స్వర్ణం ఖాయమన్న అంచనాలను నిజం చేస్తూ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ ద్వయం స్వర్ణాన్ని దక్కించుకుంది. కజికిస్తాన్ ఆటగాళ్లతో సాగిన హోరాహోరీ పోరులో విజయం సాధించి స్వర్ణాన్ని పదిలం చేసింది. రోయింగ్ లైట్‌వెయిట్ స్కల్స్ పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్ కాంస్యాలను సొంతం చేసుకుంటే, షూటింగ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిధు కాంస్యాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆరో రోజు ముగిసేసరికి భారత్ ఆరు స్వర్ణాలు, 5 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 25 పతకాలు సాధించినట్టయ్యింది.