క్రీడాభూమి

కబడ్డీకి ఇరాన్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 24: సంప్రదాయక క్రీడ కబడ్డీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత్‌కు ఆసియా గేమ్స్‌లో బలమైన ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్స్‌లో పురుషుల, మహిళల జట్లు రెండూ ఇరాన్ చేతిలో ఖంగుతిని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. శుక్రవారం చారిత్రక అపజయాల పరాభవంతో ఆసియా గేమ్స్‌నుంచి భారత కబడ్డీ నిష్క్రమించక తప్పలేదు. సెమీఫైనల్స్‌లో ఇరాన్ జట్టుతో తలపడిన భారత పురుషుల జట్టు 27-17తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ప్రపంచ చాంపియన్ల హోదాలో బరిలోకి దిగిన మహిళా జట్టూ 27-24 స్కోరుతో ఇరాన్ మహిళల చేతిలో ఖంగుతింది. రెండు జట్లమధ్య హోరాహోరీ సాగిన పోరులో ఇరాన్ మహిళలే పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు.
ఎక్కువ ఎదురు దెబ్బలే
ఆసియా గేమ్స్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత విలుకాళ్లు చేతులెత్తేశారు. కిందిస్థాయి ర్యాంకులోనున్న మంగోలియా జట్టుపై 4-5 స్కోరుతో క్వార్టర్ ఫైనల్స్ నుంచే నిష్క్రమించారు. ప్రపంచ నెంబర్ 7 ర్యాంకర్ దీపికా కుమారి, 19వ ర్యాంకర్ అతను దాస్, 94, 254 ర్యాంకుల్లోవున్న మంగోలియా ఆర్చర్లు ఓటగొబ్బోల్డ్ బాతర్ఖుయా, బిషిండే ఉరాంతున్‌గాల్గ్‌లకు ఏమాత్రం పోటీ ఇవ్వలేక క్వార్టర్ ఫైనల్స్ నుంచే నిష్క్రమించారు. ఇక ఆసియా ఫెన్సింగ్‌లో మహిళల ఈపీ క్వార్టర్ ఫైనల్స్‌లో 25-24తో చైనా చేతిలో భారత జట్టు ఓటమి చవిచూసింది. బ్యాడ్మింటన్‌లోనూ శుక్రవారం భారత టాప్ షట్లర్లకు ఎదురు దెబ్బలే తగిలాయి. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌లు విఫలమైన టోర్నీ నుంచి నిష్క్రమించారు. హాంకాంగ్ షట్లర్ వాంగ్‌వింగ్ కి వినె్సట్ చేతిలో 21-23, 19-21 స్కోరుతో కిడాంబి ఓడితే, థాయ్ ఆటగాడు కంటపోన్ వాంగ్‌చెరియన్‌తో హోరాహోరీ పోరాడిన ప్రణయ్ 12-21, 21-15, 15-21 స్కోరుతో ఓటమి చవిచూశాడు. మహిళల డబుల్స్‌లో అశ్వనీ పొన్నప్ప, ఎన్ సిక్కిరెడ్డి ద్వయం ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకోవడం భారత్‌కు ఒకింత ఉపశమనం. ఇక స్వాష్ వ్యక్తిగత విభాగాల్లో ఆటగాళ్లు అత్యద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మూడు పతకాలు ఖాయం చేశారు. స్వాష్ వ్యక్తిగత విభాగంలో సౌరవ్ ఘోషల్, జోత్స్న చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు ప్రత్యర్థులను మట్టి కరిపించి సెమీస్‌కు చేరడంతో మూడు పతకాలు ఖాయమయ్యాయి. గోల్ఫ్ పురుషుల టీం మ్యాచ్‌లో క్షితిజ్ నవీద్ కౌల్, ఆదిల్ బేడి, రేహాన్ థామస్‌లు అద్వితీయ ప్రతిభతో రెండుస్థానాన్ని కొనసాగిస్తుంటే, 63 కేజీ మహిళా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఏమాత్రం ఫాం ప్రదర్శించలేక రాఖీ హల్దార్ పూర్తిగా నిరాశపర్చింది. పురుషుల హ్యాండ్‌బాల్‌లో దాదాది దేశం పాకిస్తాన్‌ను 28-27 స్కోరుతో భారత జట్టు ఓడిస్తే, స్విమ్మింగ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో సందీప్ సెజ్‌వాల్ 7వ రౌండ్‌కు చేరుకున్నాడు. 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌కు భారత స్విమ్మర్ అద్వైత్ పేజ్ అర్హత సాధించలేకపోయాడు. ఆసియా జిమ్నాస్టిక్స్‌లో భారత అథ్లెట్లు పూర్తిగా విఫలమయ్యారు. వ్యక్తిగత, టీం ఈవెంట్లలో పురుషులు, మహిళా జట్లు నిరాశపర్చడమే కాదు, కనీస పతకం కూడా లేకుండానే తిరుగుముఖం పట్టారు.
హాకీలో ఓకే
ఆసియా గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం 8-0తో జపాన్ జట్టును మట్టి కరిపించి ముచ్చటగా మూడో చారిత్రక విజయాన్ని జమ చేసుకుంది. తరువాత మ్యాచ్ శ్రీలంకతో ఆడి గ్రూప్ మ్యాచ్‌ల్ని ముగించనున్న ప్రపంచ 5వ ర్యాంకర్ భారత జట్టు, ఆదివారం ప్రపంచ 14వ ర్యాంకర్ కొరియా జట్టుతో తలపడనుంది.