క్రీడాభూమి

టెన్నిస్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలెంబాగ్, ఆగస్టు 24: టెన్నిస్ టాప్‌సీడ్స్ రోహన్ బొపన్న, దివిజ్ శరణ్‌లు శుక్రవారం అద్వితీయ విజయంతో పసిడి సాధించారు. 52 నిమిషాల అలుపెరగని ఆటతో కజకిస్తాన్ ఆటగాళ్లు అలెగ్జాండర్ బబ్లిక్, డెనిస్ యెవ్సెయేవ్‌లను 6-3, 6-4 సెట్లతో మట్టికరిపించారు. భారత ఆటగాడు బోపన్న అటాకింగ్ సర్వీసుల ముందు కజకిస్తాన్ ఆటగాళ్లు నిలవలేకపోయారు. రెండో గేమ్‌లోనూ కజక్ ఆటగాళ్ల ప్రయత్నాలు భారత ద్వయం ముందు సాగలేదు. 18వ ఆసియా గేమ్స్‌లో భారత టెన్నిస్‌కు ఇది తొలి స్వర్ణమైతే, ఇప్పటి వరకూ పురుషుల డబుల్స్‌లో 4సార్లు స్వర్ణాలు దక్కాయి. 2010 గాంగ్జులో సోమ్‌దేవ్ దేవర్‌మన్, సనమ్ సింగ్ స్వర్ణాన్ని సాధించారు. 2002, 2006 ఆసియా గేమ్స్‌లో స్వర్ణాలు సాధించి మహేష్ భూపతి, లియాండర్ పేస్‌లు పురుషుల డబుల్స్‌లో టాప్ జట్టుగా నిలివడం తెలిసిందే.
హీనాకు కాస్యం
ఆసియా గేమ్స్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ హీనా సిధు కాంస్యాన్ని సొంతం చేసుకుంది. చివరి షూట్స్‌లో అనూహ్యంగా 10.8, 9.6 పాయింట్లతో 9వ స్థానంనుంచి (219.2 పాయింట్లు) అనూహ్యంగా మూడోస్థానానికి చేరుకుని కాంస్యాన్ని సాధించింది. ‘ఫైనల్స్‌లో నా ప్రయత్నం ఫలించి పతకం దక్కింది. ఫైనల్స్‌కు అర్హతను చాలా తక్కువ నిర్దేశించడం మాత్రం సంతృప్తికరంగా లేదు’ అని సిధు వ్యాఖ్యానించింది. ఇదిలావుంటే ఖాయంగా పతకం తీసుకొస్తుందన్న అంచనాలతో రేంజ్‌లోకి దిగిన 16 ఏళ్ల మనుబాకర్ ఐదో స్థానానికే పరిమితమైంది. 10మీ, 25మీ, మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో సైతం బాకర్ పతకాన్ని సొంతం చేసుకోలేకపోయింది. 10మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో 240.3 పాయింట్ల ఆసియా గేమ్స్ రికార్డుతో చైనా షూటర్ వాంగ్ క్వియాన్ స్వర్ణం సాధిస్తే, 237.6 పాయింట్ల సరాసరితో దక్షిణ కొరియా షూటర్ కిమ్ మింజుంగ్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది.