క్రీడాభూమి

నన్ను తోసేసి స్వర్ణం కొట్టేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: మారథాన్ ఫైనల్స్‌లో జపాన్ అథ్లెట్ హిరోటో ఇనోయు తనను తోసేసి పసిడి సాధించుకున్నాడంటూ బెహ్రెయిన్ అథ్లెట్ ఎల్హస్సన్ ఎలబ్బాసి ఆసియా నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. రేస్‌లో చివరి వంద మీటర్లు అధిగమించే సమయంలో ఓవర్‌టేక్ చేస్తున్న తనను హిరోటో గెంటివేశాడని, ట్రాప్‌పై నిలదొక్కుకుని రేస్ పూర్తి చేయగలిగానని ఫిర్యాదు చేశాడు. ‘హిరోటో నన్ను గెంటివేశాడు. లేదంటే నేనే స్వర్ణం సాధించి ఉండేవాడి’నంటూ ఎలబ్బాసి పేర్కొన్నాడు. జరిగిన ఘటనపై సాంకేతిక విచారణ జరపాలంటూ నిర్వాహకులకు టీం మేనేజర్ ఫిర్యాదు చేశాడని కోచ్ గ్రెగొరి కిలిన్జో పేర్కొన్నారు. ‘రేస్ ముగించే సమయంలో నాకేం అర్థంకాలేదు. నేను ఆశ్చర్యపోయాను. ఏం జరిగిందన్నది మాత్రం తెలియలేదు’ అని హిరొటో పేర్కొన్నాడు. మారథాన్‌ను ఇద్దరు అథ్లెట్లు 2 గంటల 17 నిమిషాల 22 సెకండ్లలో పూర్తి చేశారు. ఫేవరెట్‌గా దిగిన హిరొటో చివరిక్షణంలో అనూహ్యంగా దూసుకురావడంతో పసిడిని సాధించుకున్నాడు.