క్రీడాభూమి

ఈక్వెస్ట్రియన్‌లో రెండు రజతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నాళ్లో వేచిన విజయం భారత్‌కు అందింది. 1982లో ఈక్వెస్ట్రియన్‌లో సాధించిన పతకం తప్ప, భారత్ ఈ క్రీడలో వెనుకబడే ఉంది. 36 ఏళ్ల తరువాత 18వ ఆసియా వేదికపై మరోసారి భారత జాకీలు తమ సత్తా చూపించారు. వ్యక్తిగత, టీం ఈవెంట్‌లో రజతాలు అందుకున్నారు.
*
జకార్తా, ఆగస్టు 26: ఆసియా గేమ్స్ ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత, టీం విభాగాల్లో భారత్ రెండు రజతాలు సాధించింది. 1982 తరువాత ఈక్వెస్ట్రియన్‌లో భారత్ రెండో స్థానానికి చేరడం ఇదే. వ్యక్తిగత జంపింగ్‌లో జాకీ ఫావుద్ మీర్జా 26.40 పాయింట్లతో ద్వితీయ స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈక్వెస్ట్రియన్‌లో భారత్ వ్యక్తిగత పతకం సాధించడం ఇదే తొలిసారి కూడా. 22.70 స్కోరుతో జపాన్ జాకీ ఓయివా యోషియాకి స్వర్ణాన్ని సాధిస్తే, చైనా జాకీ హువా టియాన్ అలెక్స్ 27.1 స్కోరుతో కాంస్యాన్ని సోంతం చేసుకున్నాడు. ఈక్వెస్ట్రియన్ పురుషుల టీం ఈవెంట్‌లో భారత జట్టు రాకేష్‌కుమార్, ఆశిష్ మాలిక్, జితేందర్ సింగ్, పావుద్ మీర్జాలు 121.30 స్కోరుతో ద్వితీయస్థానం సాధించి రజతాన్ని ఖాయం చేసుకున్నారు. 82.40 స్కోరుతో జపాన్ జట్టు స్వర్ణాన్ని, 126.70 స్కోరుతో థాయిలాండ్ జట్టు కాంస్యాన్ని కైవసం చేసుకున్నాయి.