క్రీడాభూమి

సమమా.. శరణమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్: ఇంగ్లాండ్‌తో టెస్ట్ పరాభవాల అవమానంతో రగిలిన టీమిండియా, థర్డ్ టెస్ట్‌లో సత్తా చాటుకుంది. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్‌తో సమవుజ్జీ కోసం సమాయత్తమైంది. థర్డ్ టెస్ట్‌లో అవకాశాన్ని చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు, ఫోర్త్ టెస్ట్‌తోనే సిరీస్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే తలంపుతో బరిలోకి దిగుతోంది. సౌతాంప్టన్‌లో నేటినుంచి మొదలవుతున్న నాల్గవ టెస్ట్ పోరులో ఎవరిది పైచేయి అన్నది ఆసక్తికరమే. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ (31 పరుగులతో), లార్డ్స్ (ఇన్నింగ్స్)లో ఓటమి మూటగట్టుకున్న విరాట్ సేన, నాటింగ్‌హామ్‌లో 203 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుని 1-2 స్కోరుతో సిరీస్ అవకాశాలు మిగుల్చుకుంది. అయతే తమకు కలిసొచ్చే రోస్‌బౌల్ స్టేడియంలోనే సిరీస్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఇంగ్లాండ్ తహతహలాడుతోంది. కాకపోతే టీమిండియా అంత సులువుగా లొంగిపోయే స్థితిలో లేదు. ట్రెంట్ బ్రిడ్జి టెస్ట్‌లో చెలరేగిన భారత బౌలర్లు ఇంగ్లీష్ టాప్ ఆర్డర్ వెన్ను విరిస్తే, 200 స్కోరుతో స్కిప్పర్ సారథి పరుగుల మోత మోగించాడు. దీంతో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన పాండ్యా సహా నాల్గవ టెస్ట్‌లోనూ పేసర్లతోనే పని పూర్తి చేయాలని టీమిండియా యోచిస్తోంది. ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే, మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో భారత పేసర్లు ఎక్కువ సమయం బ్యాటింగ్ చేస్తూ కనిపించటం. జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమిలు ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చూపేందుకే సన్నద్ధమైనట్టు కనిపిస్తోంది. ట్రెంట్ బ్రిడ్జితో పోల్చిచూస్తే రైస్‌బౌల్ మైదానంపై పచ్చిక కనిపిస్తుండటంతో యాదవ్‌ను తుది జట్టులో కొనసాగించక తప్పని స్థితి. మరోపక్క అశ్విన్ ఫిట్‌నెస్‌పైనా సందిగ్దం లేకపోలేదు. నాటింగ్‌హామ్ టెస్ట్‌లో తుంటినొప్పితో బాధపడిన అశ్విన్, నాలుగు రోజుల తరువాత సోమవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైనా పెద్దగా బౌలింగ్ చేయలేదు. మంగళవారం ఎలాంటి ఇబ్బందీ లేకుండానే ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేయడం కనిపించింది. ఏదేమైనా టాస్‌టైంకి అశ్విన్ అందుబాటులోకి రాకపోతే, బ్యాంటింగ్, బౌలింగ్‌లో అనుభవమున్న రవీంద్ర జడేజా ఎలానూ ఉండనే ఉన్నాడు. అశ్విన్ అందుబాటులోకి రాలేకపోతే బదులెవరన్న దానిపై టీం మేనేజ్‌మెంట్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకున్నా, పరిస్థితులను బట్టి కరుణ్ నాయర్‌నైనా రంగంలోకి దించొచ్చు. ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్‌లో కరుణ్ నాయర్ ఒకింత బిజీగానే కనిపించాడు. పృధ్వీ షా, హనుమ విహారికి జట్టులో అవకాశం కల్పించినా, తుది జట్టులో అవకాశం కల్పించేదానిపై అనుమానాలు లేకపోలేదు. ఇక ఇంగ్లాండ్‌కూ ఇబ్బందులు లేకపోలేదు. ఫిట్‌నెస్ పరంగా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో, సెకెండ్ స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తూ బెన్‌స్టోక్స్ ఇబ్బందులు ఎదుర్కొంటూ కనిపించారు. దుర్హమ్‌ను సీన్‌లోకి దింపుతారా, క్రిస్‌వోక్స్ జట్టులో ఉంటాడా? అన్నదానిపైనా స్పష్టత లేదు. గత మ్యాచ్‌లో పక్కనపెట్టిన శామ్ కుర్రన్ అవకాశం కల్పించే అవకాశాలూ లేకపోలేదు. బెయిర్‌స్టోకు బదులుగా రెడీ అవుతున్న జెమ్స్ విన్స్‌కు అవకాశం కల్పిస్తారా? అన్నది డౌటే. టాప్‌ఆర్డర్ లెఫ్ట్‌హ్యాండర్స్ అలిస్టర్ కుక్, కీటన్ జిన్నింగ్స్‌ను ఇషాంత్ ఇబ్బంది పెడతాడని భావిస్తే మార్పులు చేపట్టొచ్చు కూడా.