క్రీడాభూమి

అక్కాచెల్లెళ్ల పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 30: అమెరికా టెన్నిస్ స్టార్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న అక్కాచెల్లెళ్లు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ మరోసారి పరప్సరం ఢీకొనందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో వీరు తలపడనున్నారు. అంతర్జాతీయ టెన్నిస్‌లో ఇంత వరకూ 29 పర్యాయాలు పరస్పరం ఎదురుపడిన ఈ ‘నల్ల కలువలు’ మరోసారి కోర్టులో అమీతుమీకి సిద్ధమయ్యారు.
రెండో రౌండ్‌లో వీనస్ 6-4, 7-5 తేడాతో కామిలా గొర్గీని ఓడించింది. సెరెనా ఎలాంటి ఇబ్బంది లేకుండా కారినా విథాఫ్ట్‌పై 6-2, 6-2 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్ చేరింది. ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే అనె్హలినా కలినినాపై స్లొయెన్ స్టెఫెన్స్, టట్జానా మరియాపై ఎలినా స్విటోలినా విజయాలు నమోదు చేశారు.
12వ సీడ్ గార్బినె ముగురుజా అనూహ్యంగా క్వాలిఫయర్ కరొలినా ముచొవా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ 6-3, 6-4, 6-2 తేడాతో వాసెక్ పొస్పిసిల్‌ను ఓడించి మూడో రౌండ్ చేరాడు. జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, నికొలొజ్ బాసిలాష్విలి, స్టానిస్లాస్ వావ్రిన్కా, జాన్ ఇస్నర్ కూడా తమతమ ప్రత్యర్థులను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.