క్రీడాభూమి

ఆర్‌సీబీ చీఫ్ కోచ్, మెంటర్‌గా గ్యారీ కిర్‌స్టన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 30: టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కోచ్, మెంటర్‌గా ఎంపికయ్యాడు. ఇంతవరకు ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న డేనియల్ వెటోరి గత కొన్ని సీజన్‌లలో జట్టును ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. దీంతో అతనిని జట్టు యాజమాన్యం తప్పించి గ్యారీ కిర్‌స్టన్‌ను ఎంపిక చేసింది. వెటోరీ గత ఎనిమిదేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్, మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కొత్తగా ఎంపికైన గ్యారీ భవిష్యత్తులో ఆడే ఐపీఎల్ మ్యాచ్‌లలో జట్టును ప్రగతిపథంలో ముందుకు తీసుకువెళ్లగలడనే ఆశాభావాన్ని ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలా వ్యక్తం చేశాడు. గత ఐపీఎల్ సీజన్‌లో గ్యారీ జట్టులోని యువ ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా శ్రమించాడని పేర్కొన్నారు.
గ్యారీ 2018 సీజన్ ఐపీఎల్‌లో జట్టు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. టీమిండియా ప్రధాన కోచ్‌గా 2008లో వ్యవహరించిన కాలంలో 2011 వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు.