క్రీడాభూమి

ఏడో స్థానంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతున్నది. మరో మూడు రోజుల ఈవెంట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, భారత్ అనూహ్యంగా పుంజుకుంటుందని అనుకోవడానికి వీల్లేదు. అయితే, 2014 ఏషియాడ్‌తో పోలిస్తే, మొత్తం పతకాల సంఖ్యలో ఈసారి ముందంజలో ఉంది. గత ఆసియా క్రీడల్లో భారత్‌కు 11 స్వర్ణం, 10 రజతం, 36 కాంస్యాలతో మొత్తం 57 పతకాలు లభించాయి. ఈసారి ఇప్పటికే 13 స్వర్ణం, 20 రజతం, మరో 25 కాంస్యాలతో మొత్తం 58 పతకాలను సాధించి, గత ఏషియాడ్ కంటే తన ప్రదర్శనను మెరుపరచుకుంది. ఇలావుంటే, గురువారం నాటి ఈవెంట్స్ పూర్తయ్యే సమయానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా వరుసగా మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చైనా 106 స్వర్ణం, 68 రజతం, 50 కాంస్యాలతో 224 పతకాలు గెల్చుకొని అగ్రస్థానంలో ఉంది. చివరి ఈవెంట్స్‌లో అసాధ్యాల నమోదయ్యే అవకాశాలు లేనందున, ప్రస్తుతం 53 స్వర్ణాలతో ద్వితీయ స్థానంలో ఉన్న జపాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనాను అధిగమించి, నంబర్ వన్‌గా నిలిచే అవకాశాలు లేనట్టే. జపాన్ 53 స్వర్ణాలతోపాటు 47 రజతం, 63 కాంస్య పతకాలను కూడా కైవసం చేసుకుంది. దక్షిణ కొరియా 37 స్వర్ణం, 44 రజతం, 53 కాంస్య పతకాలు (మొత్తం 134) సాధించి, మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియా (30 స్వర్ణం, 22 రజతం, 37 కాంస్యం, మొత్తం 89), ఇరాన్ (19 స్వర్ణం, 17 రజతం, 19 కాంస్యం, మొత్తం 55), చైనీస్ తైపీ (14 స్వర్ణం, 17 రజతం, 21 కాంస్యం, మొత్తం 52) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
పురుషుల హాకీ
గోల్డ్ మెడల్‌పై భారత ఆశలు గల్లంతు
సెమీ ఫైనల్స్‌లో ఓటమి
ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు గోల్డ్ మెడల్‌పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. చావోరేవో అన్నట్టు సాగిన సెమీ ఫైనల్స్‌లో మలేషియా విజయం సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో మలేషియా చేతిలో 6-7 తేడాతో భారత్ ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు చేసిన చిన్నచిన్న పొరపాట్లే ప్రత్యర్థి గెలుపునకు బాటలు వేశాయి. 60 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 2-2 పాయింట్లు సాధించడంతో షూటౌట్‌ను మలేషియా జట్టు తనకు అనుకూలంగా మలచుకుని భారత్‌పై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించేందుకు మలేషియా అవకాశాలను మెరుగుపరుచుకోగా, భారత్‌కు ఆశలు సంక్లిష్టం కానున్నాయి.
ప్రీక్వార్టర్స్‌లోనే నిరాశపరచిన హర్‌దీప్, గరీమా
ఆసియా క్రీడల్లో భారత జూడో క్రీడాకారులు నిరాశపరిచారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో హర్‌దీప్ సింగ్ బ్రార్, గరీమా చౌదరి ప్రత్యర్థి చేతుల్లో ఓటమిపాలయ్యారు. పురుషుల 81 కేజీల విభాగంలో దక్షిణ కొరియా క్రీడాకారుడు ఇంగ్సూ లీతో జరిగిన మ్యాచ్‌లో హర్‌దీప్ సింగ్ 3-10 తేడాతో పరాజయం చెందాడు. మహిళల 70 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి గరీమా చౌదరి ఉజ్జెకిస్తాన్‌కు చెందిన గుల్నోజా మ్యాట్నియాజొవ్ చేతిలో 0-10 తేడాతో ఓడిపోయింది.