క్రీడాభూమి

సగం ఆడేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్: 51 శాతం బంతులు.. 48 శాతం పరుగులు. భారత్- ఇంగ్లాండ్ మధ్య సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఛెతేశ్వర్ పూజారా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కు ఇది పరాకాష్ట. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 84.5 ఓవర్లలో 273 పరుగులు చేసి 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు శుక్రవారం 19 పరుగులతో భారత్ నైట్‌వాచ్‌మెన్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ ఆట మొదలుపెట్టారు. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే రాహుల్ (19- 24బంతుల్లో), శిఖర్ ధావన్ (23-53 బంతుల్లో)ను బ్రాడ్ పెవిలియన్‌కు పంపాడు. 50 పరుగులకే ఓపెనర్లు కుప్పకూలడంతో క్రీజ్‌లోకి దిగిన ఛెతేశ్వర్ పూజారా ఇన్నింగ్స్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 15వ టెస్ట్ సెంచరీ పూర్తి చేసిన పూజారా 257 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో నాటౌట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తొలుత ఓపెనర్లు కూలిపోవడంతో వికెట్ కోల్పోకుండా క్రీజులోవున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడితే, ఛెతేశ్వర్ పూజారా చక్కటి భాగస్వామ్యం అందించాడు. దీంతో భోజన విరామ సమయానికి టీమిండియా 100 పరుగులు చేసింది. భారత్ నిలదొక్కుకుంటున్న సమయంలో కుర్రన్ బౌలింగ్‌లో కోహ్లీ (46- 71 బంతుల్లో) కుక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మూడు వికెట్ల నష్టానికి 151 పరుగుల వద్దనున్న భారత్, తరువాత వరుసగా వికెట్లు కోల్పోయింది. స్టోక్స్ బంతికి రహానె (11- 14 బంతుల్లో), మొరుూన్ అలీ చేతిలో రిషబ్‌పంత్ (0-29 బంతుల్లో) ఎల్బీడబ్ల్యు అయ్యారు. తరువాత మొరుూన్ (16 ఓవర్లలో 63 పరుగులకు 5 వికెట్లు) టీమిండియాపై పగబట్టడంతో హార్దిక్ పాండ్యా (4- 5 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్ (1-7 బంతుల్లో), మహ్మద్ షమి (డకౌట్), ఇషాంత్ శర్మ (14- 27 బంతుల్లో) పెవిలియన్‌కు చేరారు. టీమిండియా వికెట్లు వరుసగా రాలుతున్నా క్రీజులో పాతుకుపోయిన పూజారా మాత్రం చివరి వికెట్ బుమ్రా (6- 24 బంతుల్లో) సహకారంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. భారత్ ఆలౌట్‌తో మలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ నాలుగు ఓవర్లలో ఆరు పరుగులు సాధించింది. ఓపెనర్లుగా జెన్నింగ్స్ (4), అలిస్టర్ కూక్ (2) ఆడుతున్నారు.