క్రీడాభూమి

తేరుకున్న ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 1: భారత్- ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ 3వ రోజు ఆటను ఇంగ్లాండ్ నిలకడగా సాగించింది. ఆట నిలిపివేసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించి, 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులోవున్న అలిస్టర్ కుక్, కీటన్ జిన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించారు. 12వ ఓవర్‌లో బుమ్రా వేసిన బంతిని కుక్ (12- 39 బంతుల్లో) ఎదుర్కొనే ప్రయత్నంలో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 24 పరుగులకే తొలి వికెట్‌ను ఇంగ్లాండ్ చేజార్చుకుంది. క్రీజులోకి వచ్చిన మెయిన్ అలీ (9- 15బంతుల్లో) సైతం ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఇషాంత్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ప్రమాదంలో పడిన ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు రంగంలోకి దిగిన కెప్టెన్ జోరూట్ (48-88 బంతుల్లో) నిలకడ ఆటకు దిగాడు. అప్పుడప్పుడు బంతిని బౌండరీలకు తరలిస్తూ క్రమంగా స్కోరు వేగాన్ని పెంచాడు. జెన్నింగ్స్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న తరుణంలో షమి బంతికి జెన్నింగ్స్ ఎల్బీడబ్యు అయి పెవిలియన్ బాటపట్టాడు. నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూల్చడంలో టీమిండియా విజయం సాధించింది. క్రీజ్‌లోకి వచ్చిన జానీ బెయిర్‌స్టో వికెట్ల ముందు షమికి దొరికిపోవడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రమాదంలో పడింది. బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ (30-110 బంతుల్లో), రూట్‌కు సహకరిస్తూ నిలకడగా స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కుదురుకుని స్కోరును పరిగెత్తించే క్రమంలో షమి చేతిలో జోరూట్ రన్నౌట్ అవ్వడంతో, క్రీజ్‌లోకి వచ్చిన జాస్ బట్లర్‌కు స్టోక్స్ పూర్తిగా సహకరించాడు. ప్రమాదంలో పడిన ఇన్నింగ్స్‌ను రక్షించుకునే కసితో జాస్ బట్లర్ (69-122 బంతుల్లో) చెలరేగాడు. అర్థ శతకాన్ని సాధించి ఇన్నింగ్స్‌ను కొలిక్కి తెచ్చాడు. పరుగులు వేగం అందుకుంటున్న సమయంలో అశ్విన్ బంతికి రహెనేకు క్యాచ్ ఇచ్చిన స్టోక్స్ పెవిలియన్ చేరడం, ఇషాంత్ బౌలింగ్‌లో జాస్ బట్లర్ ఎల్బీడబ్ల్యు కావడంతో 87 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 245కు చేరింది. ఆదిల్ రషీద్ సహకారంతో శామ్ కుర్రన్ తనవంతు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరును మరికొంత ముందుకు తీసుకెళ్లాడు. షమి బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి రషీద్ (11-22 బంతుల్లో) పెవిలియన్‌కు చేరాడు. 3వ రోజు ఆట నిలిపివేసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించింది. కుర్రన్ క్రీజులో ఉన్నాడు. మహ్మద్ షమి 3, ఇషాంత్ శర్మ రెండు, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీసుకుని ఇంగ్లాండ్ స్కోరుబోర్డుకు బ్రేకులు వేశారు.