క్రీడాభూమి

ఇద్దరు షూటర్లకు ఒలింపిక్ బెర్త్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంఘ్వాన్, సెప్టెంబర్ 3: టోక్యో 2020 ఒలింపిక్‌కు ఇద్దరు భారత షూటర్లు బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రజతం, నాల్గవ స్థానాన్ని సాధించిన షూటర్లు అంజుమ్ వౌద్గిల్, అపూర్వీ చండేలాలు వచ్చే ఒలింపిక్‌కు అర్హత సాధించారు. ఈవెంట్‌లో కొరియన్ షూటర్లు హనా ఇమ్ (251.1) స్వర్ణాన్ని, ఇన్హు జంగ్ (228.0) కాంస్యాన్ని సాధిస్తే, 24 ఏళ్ల వౌద్దిల్ 248.4 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్‌లో 207 పాయింట్లతో చండీలా నాల్గవ స్థానాన్ని నిలుపుకుంది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్‌లో సాధించిన పాయింట్లను ఒలింపిక్ అర్హతకు పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనల మేరకు, అంజుమ్ వౌద్గిల్, అపూర్వీ చండేలాలకు బెర్త్‌లు ఖరారయ్యాయి.

చిత్రం..అంజుమ్ వౌద్గిల్