క్రీడాభూమి

ఓటమి బాధ్యత రవిశాస్ర్తీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 4: టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకోవడంలో టీమిండియా వైఫల్యాలపై దాదా గొంతువిప్పాడు. వరుస వైఫల్యాలకు ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ బాధ్యత వహించకుంటే.. విదేశీ పర్యటనల వైఫల్యాల వరుసలో ఎలాంటి మార్పూ ఉండదని హెచ్చరించాడు. ఒక్క నాటింగ్‌హామ్ తప్ప నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో మూడింటిని ఇంగ్లీష్ జట్టు కైవసం చేసుకుని సిరీస్‌ను సాధించడం తెలిసిందే. ఎన్నో గెలుపు అవకాశాలు టీమిండియా తలుపుతట్టినా, జట్టు స్పందించలేకపోయిందని వ్యాఖ్యానించాడు. గెలుపు అవకాశాలు ఎన్ని ఉన్నాయో, కోహ్లీ సేన ఓటమికీ కారణాలు అనే్న ఉన్నాయని దాదా నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. ‘చాలాకాలంగా బ్యాటింగ్ లైనప్ పేలవమైన ప్రదర్శనతో పరుగులు సాధించలేకపోతోంది. పర్యాటక మ్యాచ్‌ల్లో టీమిండియా సామర్థ్యాలను ఒక్కసారి పరికించి చూడండి. 2011 నుంచీ పెద్ద సిరీస్‌లు అన్నింటిలోనూ టీమిండియా ఓటములను మూటగట్టుకుంది. బౌలర్ల బంతులను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ, ఇతర బ్యాట్స్‌మెన్ల మధ్య కనిపిస్తోన్న వ్యత్యాసమే అందుకు ఉదాహరణ. ప్రస్తుత బ్యాట్స్‌మెన్ల సామర్థ్యం అత్యంత పేలవంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సంకోచాలు అక్కర్లేదు. ముందు టీమిండియాలో ఆత్మస్థయిర్యం కొరవడింది. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటికైనా పరిష్కారం అనే్వషించకుంటే, మరింత భయానక పర్యావసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. టీమిండియా వైఫల్యాలకు ప్రధాన కోచ్ రవిశాస్ర్తీ, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సహా జట్టు నిర్వాహకులంతా బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితికి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సహా చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ బాధ్యత వహించాలి. జట్టులో ఒక ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నపుడు, మిగిలిన వాళ్లు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ ప్రశ్నలకు పరిష్కార సమాధానాలు వెతుక్కోకపోతే, వచ్చే మూడు విదేశీ పర్యటనల్లో టీమిండియా విజయాలు చూడటం అసాధ్యమేమో’ అని వ్యాఖ్యానించాడు. సారథి కోహ్లీకి జట్టు సభ్యులు మరింత భాగస్వామ్యం అందించాల్సి ఉందని సూచించాడు. ‘మీడియా కాన్ఫరెన్స్‌లో కోహ్లీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అర్థమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో జట్టు సభ్యులు ధైర్యంతో ముందడుగు వేయాలి. గత ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ ఐదింటిని కోల్పోయింది. సౌతాంఫ్టన్‌లోనూ భారత్ అపజయాల అంచులకు వెళ్లిందని కామెంటేటర్లు చెబుతున్నా, కోహ్లీ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఫలితం అందరికీ తెలిసిందే. ఇది జట్టు సభ్యుల్లో ప్రతి ఇన్నింగ్స్‌లో, ప్రతి మ్యాచ్‌లో కనిపించాలి. 20 వికెట్లు తీసుకుంటే ప్రత్యర్థిని గెలిచినట్టు కాదు, అందుకు తగిన పరుగులు కూడా సాధించాలి’ అని దాదా వ్యాఖ్యానించాడు.