క్రీడాభూమి

52 కేజీల విభాగంలో గెలుపు కోసం అమెరికాలో శిక్షణకు అమిత్ పంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ అమిత్ పంగల్ తన తదుపరి ఒలింపిక్స్‌లో మెడల్ సాధించే లక్ష్యంలో భాగంగా అమెరికా శిక్షణ పొందనున్నాడు. భారత ఆర్మీ సహకారంతో అమెరికాలో తగిన శిక్షణ పొందేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపాడు. 22 కేజీల అమిత్ ఫంగల్ జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో 49 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆసియా క్రీడల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బాక్సర్‌గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం సాధించిన అద్భుత ప్రదర్శనతోనే సంతృప్తిపడకుండా టోక్యోలో జరిగే ఒలింపిక్ క్రీడల్లో 52 కేజీల విభాగంలో గోల్డ్‌మెడల్ కైవసం చేసుకునే దిశగా కృషి చేస్తానని గట్టి ధీమాతో ఉన్నాడు. ఆసియా గేమ్స్‌లో 49 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం ఇదే ఆఖరిసారని, ఇపుడు తన దృష్టి అంతా 52 కేజీల విభాగంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమేనని అన్నాడు. తన ఈ కొత్త చాలెంజ్ గొప్పది కాదని అంటూ ఇదో అతి పెద్ద చాలెంజ్ లాంటిదని, దీనిని సాధించి తీరుతానని భారత ఆర్మీ నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమం సందర్భంగా అమిత్ ఫంగల్ వ్యాఖ్యానించాడు. ఇందుకు అనుగుణంగా తగిన తర్ఫీదు పొందేందుకు, అమెరికా వెళ్లనున్నానని, అయితే, తన పర్యటనకు ఆర్మీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నందున తుది నిర్ణయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుందని పేర్కొన్నాడు.