క్రీడాభూమి

వార్నరే కీలకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: హోం గ్రౌండ్‌లో మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించనున్నాడు. సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహిస్తున్న అతను అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, జట్టుకు తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాలని సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, అతని దూకుడుకు కళ్లెం వేయాలని, ఎంత త్వరగా అవుట్ చేసి పెవిలియన్‌కు పంపిస్తే తమ విజయావకాశాలు అంతగా మెరుగుపడతాయని పుణె కెప్టెన్ ధోనీ ఆలోచన. మొత్తం మీద రెండు జట్ల దృష్టి వార్నర్‌పైనే కేంద్రీకృతమైంది. అతను అద్భుతంగా ఆడాలని ఒకరు అనుకుంటే, దారుణంగా విఫలం కావాలని మరొకరు ఆశిస్తున్నారు.
మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్న సన్‌రైజర్స్ అనూహ్యంగా చెలరేగిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను 7 వికెట్లు, గుజరాత్ లయన్స్‌ను 10 వికెట్లు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, కేన్ విలియమ్‌సన్ వంటి మేటి ఆటగాళ్లు ఫిట్నెస్ కారణంగా మ్యాచ్‌లు ఆడలేకపోతున్నప్పటికీ, వార్నర్ అంతా తానై జట్టును నడిపిస్తున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చిన అంశం. ఇప్పటి వరకూ ఈటోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వార్నర్‌ది రెండో స్థానం. మోజెస్ హెన్రిక్స్, ఇయాన్ మోర్గాన్, వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ నమన్ ఓఝా తదితరులు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే, భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి వచ్చాడు. బంగ్లాదేశ్ పేసర్ ముస్త్ఫాజుర్ రహ్మాన్ ఇప్పటి వరకూ ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు. బరీందర్ శరణ్, దీపక్ హూడా, బిపుల్ శర్మ కూడా బౌలింగ్ విభాగంలో సన్‌రైజర్స్ బలాన్ని పెంచుతున్నారు.
ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన రైజింగ్ పుణె జట్టు మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఓడించింది. ధోనీ నాయకత్వంలోని ఈ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని, విజయాల ప్రస్థానంలో ఇది తొలి అడుగు అని అంతా అనుకున్నారు. కానీ, ఆతర్వాత నాలుగు వరుస పరాజయాలు పుణెను వెక్కిరించాయి. గుజరాత్ లయన్స్ 7 వికెట్లు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 6 వికెట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 13 పరుగులు, కోల్‌కతా నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో పుణెను ఓడించాయి. ఈ ఓటముల నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడానికి పుణె కెప్టెన్ ధోనీ ప్రయత్నిస్తున్నాడు. ఆజింక్య రహానే చక్కటి ఫామ్‌ల ఉండగా, కెవిన్ పీటర్సన్ కాలి కండరాలు బెణకడంతో ఐపిఎల్‌కు దూరమయ్యాడు. మిచెల్ మార్ష్, రవిచంద్ర అశ్విన్, మురుగన్ అశ్విన్, ఈశ్వర్ పాండే, ఇశాంత్ శర్మ తదితరులతో పుణె బలంగా కనిపిస్తున్నప్పటికీ, ధోనీ సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే పరాజయాలు తప్పడం లేదన్న వాదన వినిపిస్తున్నది. మొత్తం మీద మంగళవారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో పుణె, విజయాల పరంపరలను కొనసాగించాలని సన్‌రైజర్స్ బరిలోకి దిగుతుండగా, మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది.