క్రీడాభూమి

ఆ విజయం మరపురానిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆసియా క్రీడల్లో తనతో పోటీ పడిన చైనా, పాకిస్తాన్ అథ్లెట్లతో ధీటుగా పోటీపడి గోల్డ్ మెడల్ సాధించిన విజయం తన జీవితంలో మరపురానిదని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. ఆసియా గేమ్స్‌లో ఈ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఆ పోటీలో 88.06 మీటర్ల వరకు జావెలిన్‌ను విసిరి సరికొత్త రికార్డు సృష్టించి, గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ఇక్కడ జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో మాట్లాడాడు. ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో మువ్వనె్నల జాతీయ జెండా పట్టుకుని భారత అథ్లెట్లతో కలసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ముందుకు కదలడం చెప్పరాని అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. తాను అప్పుడే అనుకున్నానని, బాగా కష్టపడడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చునని బలంగా నమ్మానని, అందుకు నిదర్శనమే జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్‌ను సాధించడమని అన్నాడు.