క్రీడాభూమి

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు జో రూట్, విరాట్ కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ జో రూట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా వ్యాఖ్యానించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 ట్రోఫీ టూర్‌లో భాగంగా ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న బ్రియాన్ లారా ఒక మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లలో భాగంగా ఇప్పటికే 1-3తో సిరీస్‌ను కోల్పోయిన భారత్ తన చివరి టెస్టు శుక్రవారం ఆడనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ శక్తిసామర్థ్యాల గురించి లారా ప్రసావిస్తూ ఇంగ్లాండ్‌తో ఇప్పటికే ఆడిన నాలుగు టెస్టుల్లో కోహ్లీ అత్యధిక పరుగులు సాధించాడన్నాడు. ఈ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు కోహ్లీ నాలుగు టెస్టుల్లో 544 పరుగులు చేయగా, ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ ఆండర్సన్, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబద తన అభిమాన బౌలర్లుగా లారా అభివర్ణించాడు.