క్రీడాభూమి

స్టాండ్‌బై కెప్టెన్‌గా వార్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 13: డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను స్టాండ్‌బై కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు ప్రకటించారు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో, వచ్చేనెల 12 నుంచి భారత్‌తో స్వదేశంలో ఆరంభం కానున్న వనే్డ సిరీస్‌లో జట్టును వార్నర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. మోకాలి నొప్పితోపాటు కండరాలు బెణకడంతో ఇబ్బంది పడుతున్న స్మిత్‌ను వెస్టిండీస్‌తో జరిగే చివరి రెండు టెస్టుల్లో ఆడించి, ఆతర్వాత విశ్రాంతినివ్వాలని సిఎ అధికారులు అనుకుంటున్నట్టు సమాచారం. ఈ వివరాలను వారు తమ ప్రకటనలో ఇవ్వలేదు. అయితే, స్మిత్ ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, స్టాండ్‌బై కెప్టెన్‌గా వార్నర్ వ్యవహరిస్తాడని వివరించారు. ఫిబ్రవరిలో చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్‌లో ఆసీస్ జట్టు పర్యటించనుంది. అప్పటికి స్మిత్ పూర్తి ఫిట్నెస్‌తో ఉండాలన్నది సిఎ అధికారుల ఆలోచన. అందుకే, అతనికి భారత్‌తో జరిగే వనే్డ సిరీస్‌లో విశ్రాంతినిస్తారని సిఎ వర్గాలు పేర్కొన్నాయి.
వరల్డ్ టి-20కి స్టార్క్ దూరం
వచ్చే ఏడాది భారత్‌తో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆస్ట్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దూరమవుతాడు. కాలి మడమకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్న కారణంగా అతను వరల్డ్ కప్‌లోపాల్గొనే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఒక ప్రకటనలో తెలిపింది. గత నెల అడెలైడ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన డే/నైట్ టెస్టు ఆడుతున్నప్పుడు స్టార్క్ గాయపడ్డాడు. అతని కుడికాలి మడల వద్ద ఎముక చిట్లడంతో శస్తచ్రికిత్స అనివార్యమైంది.

బ్రెండన్ మెక్‌కలమ్
సిక్సర్ల సెంచరీ
డ్యునెడిన్, డిసెంబర్ 13: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడం గిల్‌క్రిస్ట్ 96 మ్యాచ్‌ల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక సిక్సర్ కొట్టిన మెక్‌కలమ్ రెండో ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు కొట్టాడు. అతనికి ఇది కెరీర్‌లో 98వ టెస్టు. గిల్‌క్రిస్ట్ 137 ఇన్నింగ్స్‌లో సిక్సర్ల సెంచరీని పూర్తి చేస్తే, మెక్‌కలమ్ 170 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. గిల్‌క్రిస్ట్ 6,796 బంతులు ఎదుర్కోగా, మెక్‌కలమ్ 9,756 బంతులు ఆడాడు. ఇలావుంటే, క్రిస్ గేల్ 98, జాక్వెస్ కాలిస్ 97, వీరేందర్ సెవాగ్ 91 సిక్సర్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.